మంగళవారం హైదరాబాద్‌లో ఐఐపీహెచ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన కేసీఆర్. చిత్రంలో టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు, మంత్రి మహేందర్ రెడ్డి, ఇన్ఫోస...
మంగళవారం హైదరాబాద్‌లో ఐఐపీహెచ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన కేసీఆర్. చిత్రంలో టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు, మంత్రి మహేందర్ రెడ్డి, ఇన్ఫోసిసనేను ఆశావాదిని...
కేసీఆర్ ప్రసంగం చాలావరకు తాత్విక ధోరణితో సాగింది. సమాజం చెడిపోయిందని చాలామంది అంటుంటారని... అలా చెడిపోతే వ్యవస్థ నిలబడదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మంచి వాళ్ల సంఖ్య ఎక్కువ ఉందని... అందుకే సమాజం నిలబడి ఉందన్నారు. తాను ఆశావాదినని తెలిపారు. 15 రోజులపాటు పోలీసులు లేని హైదరాబాద్ ఎలా ఉంటుందని ఏ పోలీసునైనా అడిగితే ‘కొట్టుకు చచ్చిపోతారని’ బదులిస్తారని, హైదరాబాద్‌ను తామే బతికిస్తున్నట్లు... తాము లేకుంటే హైదరాబాద్ బతకదని అంటారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ‘హైదరాబాద్ ను ఏ పోలీసు, ఏ ప్రభుత్వం బతికివ్వట్లేదు. ఒక సంఘంగా, సమాజంగా హైదరాబాద్ తనకు తాను బతుకుతోంది. సంఘ జీవన క్రమంలో అప్పుడప్పుడు తలెత్తే అపశృతులను సరిచేసే చిన్నపాటి మెకానికే పోలీసు. కానీ తాము లేకపోతే దేశమే లేదంటారు వారు’ అని వివరించారు. ప్రభుత్వ వైద్యులపైనా కేసీఆర్ చురకలు వేశారు. వైద్య సేవలు అందించే పీహెచ్ఎఫ్ఐ వంటి సంస్థల గురించి చెబితే ప్రభుత్వ వైద్యులు అంగీకరించరన్నారు. ‘మేం సన్నాసులమా? మాకు రాదా? ఇటువంటి సంస్థలు తెరవాలా? మాకేంటి చెప్పేది’ అంటూ ఫీలవుతారని అన్నారు. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్ఎఫ్ఐ) లీడర్షిప్ కౌన్సిల్ చైర్మన్ ఎన్.ఆర్.నారాయణమూర్తి ఆశీస్సులతో ముందుకు సాగుతామన్నారు. పీహెచ్ఎఫ్ఐ అధ్యక్షుడు కె.శ్రీనాథరెడ్డి ఇక్కడ సేవ చేయడం సంతోషాన్నిస్తుందన్నారు ఐఐపీహెచ్ భవన నిర్మాణానికి రూ. 60 కోట్లు ఖర్చుకానుందని.. వెంటనే రూ. 10 కోట్లు విడుదల చేస్తున్నానని కేసీఆర్ ప్రకటించారు. మిగిలినవాటిపై సమావేశం పెట్టి చర్చిస్తామన్నారు. యాజమాన్యం సంస్థకు యూనివర్సిటీ హోదా కోరుతోందన్నారు. అనంతరం ఎన్.ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ ఆరోగ్య రాష్ర్టంగా తెలంగాణ అభివృద్ధి చెందే అవకాశాలున్నాయన్నారు. వ్యాధి నియంత్రణపై దృష్టిపెడితే వైద్యంపై పెట్టే ఖర్చు తగ్గుతుందన్నారు. దీనివల్ల ధనిక రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రజారోగ్యంలో అనేక లోపాలున్నాయని, వాటిని అధిగమించి రాష్ర్ట ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎంను కోరారు. కె.శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో బలహీనమైన వైద్య వ్యవస్థ ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. సాంకేతికంగా, వైద్యపరంగా ఎన్ని అవకాశాలున్నా అవి ప్రజ లకు చేరినప్పుడే ప్రయోజనమన్నారు. ఈ సభకు టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ హాజరయ్యారు.