-జీవో విడుదల చేసిన ప్రభుత్వం వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లికార్జునస్వామికి మహాశివరాత్రి రోజున కల్య...
వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లికార్జునస్వామికి మహాశివరాత్రి రోజున కల్యాణానికి ప్రభుత్వం తరుపున పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా మల్లికార్జునస్వామి, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మల కల్యాణానికి ప్రభుత్వం తరపున పట్టువస్ర్తాలు, తలంబ్రాలు అందించాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం శనివారం జీవో విడుదల చేసింది. చరిత్రలో తొలిసారిగా అధికారికంగా మల్లన్నస్వామి కల్యాణానికి పట్టువస్ర్తాలు అందనున్నాయి. సీమాంధ్ర పాలనలో వివక్షకు గురైన తెలంగాణ దేవాలయాలను గుర్తించి, గౌరవిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
