వరంగల్ : వరంగల్ జిల్లా హన్మకొండ బస్టాండ్ సమీపంలోని హయగ్రీవాచారి మైదానంలో నిర్వహించనున్న తెదేపా సభా వేదికకు కొంతమంది దుండగులు నిప్పు...
వరంగల్ : వరంగల్ జిల్లా హన్మకొండ బస్టాండ్ సమీపంలోని హయగ్రీవాచారి మైదానంలో నిర్వహించనున్న తెదేపా సభా వేదికకు కొంతమంది దుండగులు నిప్పుపెట్టారు. దీంతో వేదిక వెనుకభాగం దగ్ధమైంది. టీడీపీ కార్యకర్తలు మంటలను ఆర్పి పరిస్థితిని చక్కదిద్దే యత్నం చేశారు.
ఈ మైదానంలో గురువారం తెలుగుదేశం నిర్వహించనున్న సభకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామన్న ఎమ్మార్పీఎస్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో ఎమ్మార్పీఎస్ కు చెందిన వారే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీంతో కొంతమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
