పట్టభద్రుల నియోజకవర్గాలకు తుది కసరత్తు పూర్తి చే సిన అధినేత కే సీఆర్ మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్‌కు దేవీప్రసాద్? వరంగల్-ఖమ్మం...

- పట్టభద్రుల నియోజకవర్గాలకు తుది కసరత్తు పూర్తి చే సిన అధినేత కే సీఆర్
- మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్‌కు దేవీప్రసాద్?
- వరంగల్-ఖమ్మం-నల్లగొండకు బండా నరేందర్‌రెడ్డి?
- అధికారిక ప్రకటనే తరువాయి
మార్చి 29వ తేదీతో గడువు ముగియనున్న ‘మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ’, ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’ పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి టికె ట్ ఆశించిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో అన్ని సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్నాకే అభ్యర్థులను ఖరారు చేయాలని అధినేత భావించడంతో ఇప్పటి దాకా సస్పెన్స్ కొనసాగింది. తెలంగాణ నాన్గెజిటె డ్ ఉద్యోగుల సంఘం (టీఎన్ జీఓ) అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ను మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గం నుంచి, నల్లగొండ టీఆర్ఎస్ కన్వీనర్ బండా నరేందర్‌రెడ్డిని వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపడం ఖాయమైంది.
తర్జన భర్జన...
ఈనెల 11వ తేదీన మండలి ఎన్నికలకు షెడ్యూలు విడుదల కాగా, గురువారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఈనెల 26వ తేదీతో నామినేషన్ల ఘట్టం కూడా ముగియనుంది. మార్చి 16వతేదీన పోలింగ్, అదే నెల 19వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు ఖాళీ అవుతుండడంతో ముందు నుంచే పార్టీలోని ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో పూర్తిగా కలసి వచ్చిన ఉద్యోగ సంఘాలకు ఒక స్థానం ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారు. దీంతో మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవ ర్గం నుంచి ఉద్యోగ సంఘాల నేతలే ఎక్కువగా ప్రయత్నించారు. టీఎన్జీఓ నేత దేవీ ప్రసాద్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించినా, ఆయన తనకు గవర్నర్ కోటా, లేదా ఎమ్మెల్యే కోటా కావాలని భీష్మించడంతో కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి వస్తే, తాను వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కూడా దేవీ ప్రసాద్ మధ్యలో మరో ప్రతిపాదన తెచ్చారని సమాచారం.
కానీ, ఉద్యోగులు అత్యధికంగా ఓటర్లుగా ఉండే మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నుంచి పోటీలో ఎవరిని పెట్టాలనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగిందని, చివరకు తర్జన భర్జనల అనంతరం దేవీప్రసాద్ అంగీకారం తెలిపారని, దీంతో ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించడమే మిగిలిందని చెబుతున్నారు. ఈ వార్తలను బలపరుస్తూ బుధవారం సాయంత్రం తనకు అందుబాటులో ఉండాలని దేవీ ప్రసాద్‌కు ముఖ్యమంత్రి నుంచి సమాచారం అందినట్లు తెలిసింది.
‘కడియం’ ససేమిరా!
వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గం నుంచి మొదట ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని బరిలోకి దింపాలని పార్టీ అధినేత కేసీఆర్ భావించినట్లు తెలిసింది. అయితే, కడియం శ్రీహరి సుముఖంగా లే కపోవడం, కొందరు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు కూడా ఈ ప్రయోగం సరికాదని అభిప్రాయపడడంతో కేసీఆర్ కూడా ఈ ఆలోచన విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం. దీంతో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం కోసం ముందు నుంచీ ప్రయత్నాలు చేసిన నల్లగొండ టీఆర్ఎస్ కన్వీనర్ బండా నరేందర్‌రెడ్డినే బరిలో దింపనున్నారని తెలిసింది.
చివరి నిమిషంలో ఏవైనా మార్పులు.. చేర్పులు జరిగితే మినహా ఈ ఇద్దరి పేర్లను ప్రకటించడమే తరువాయి అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం సాయంత్రంలోగా కానీ, శుక్రవారం గానీ వీరి పేర్లను టీఆర్ఎస్ తమ అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉంది. బుధవారం ముంబై నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌తో దేవీప్రసాద్, బండా నరేందర్‌రెడ్డిల భేటీ జరగలేదు. గురువారం ఉదయం వీరు సీఎంను కలిసే అవకాశం ఉందని, ఆ తర్వాత రెండు నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటన రావచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.