* సారాయి పేరిట కాకుండా ‘చీపెస్ట్ లిక్కర్’గా మార్కెట్లోకి * మహారాష్ట్ర దేశీదారు తరహాలో తెచ్చే యోచన.. విధివిధానాలకు మెరుగులు దిద్దుతున్న ఆ...
* సారాయి పేరిట కాకుండా ‘చీపెస్ట్ లిక్కర్’గా మార్కెట్లోకి
* మహారాష్ట్ర దేశీదారు తరహాలో తెచ్చే యోచన.. విధివిధానాలకు మెరుగులు దిద్దుతున్న ఆబ్కారీ శాఖ
* నగరం, పట్టణం, గ్రామీణం పేరుతో లెసైన్స్ ఫీజులు.. త్వరలో సీఎంతో ఆబ్కారీ శాఖ సమావేశం
హైదరాబాద్: నాటు సారాను నియంత్రించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండేలా ‘చీపెస్ట్ మద్యం (సారా)’ను జూలై ఒకటో తేదీ నుంచి ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. అయితే దీనిని సారాయి పేరుతో కాకుండా.. మహారాష్ట్రలోని దేశీదారు తరహాలో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అయితే ఒకప్పటిలా వేలం ద్వారా సారాయి దుకాణాలను అప్పగించకుండా... ప్రత్యేక విధానాన్ని అమలు చేయాలని, లాటరీ పద్ధతిని అనుసరించాలని భావిస్తోంది. జూన్‌లో వచ్చే కొత్త మద్యం పాలసీలో భాగంగా చౌక మద్యం పాలసీని విడిగా ప్రకటించే అవకాశముంది. ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీం నేతృత్వంలో రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఒక కమిటీ విధివిధానాలు రూపొందించింది. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జరిగే ఎక్సైజ్ శాఖ అధికారుల సమావేశంలో ఈ ‘చీపెస్ట్ లిక్కర్’ ప్రతిపాదనలను ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సారాయి పేరు పట్ల విముఖత..
1993లో వచ్చిన సారా వ్యతిరేక ఉద్యమం సందర్భంగా అప్పటి ప్రభుత్వం సారాయిపై నిషేధం విధించిన నేపథ్యంలో... ఇప్పుడు మళ్లీ సారాయి దుకాణాలను నెలకొల్పాలనే ప్రతిపాదనను సీఎం కేసీఆర్ వ్యతిరేకించినట్లు తెలిసింది. నిషేధించిన సారాయిని ప్రభుత్వం తిరిగి తీసుకొస్తుందనే అపప్రథను మూటగట్టుకోకుండా.. మహారాష్ట్రలో అమలుచేస్తున్న దేశీదారు తరహాలో, దానికన్నా తక్కువ ధరకు ‘చీపెస్ట్ లిక్కర్’ను ప్రవేశపెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మహారాష్ట్రలో దేశీదారును మూడు రకాలుగా విక్రయిస్తున్నారు. నగరాల్లో వైన్‌షాపులు, బార్లలో దేశీదారు సీసాలు కూడా విక్రయిస్తారు. పట్టణాలు, తాలూకా కేంద్రాల్లో దేశీదారుతో పాటు బీర్ల విక్రయాలకు ఔట్లెట్లను నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో జనాభా ప్రాతిపదికన దేశీదారు ఔట్లెట్లు ఉంటాయి.
ఇదే విధానంలో కొన్ని మార్పులు చేసి రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో కల్లు దుకాణాలకు ఈ ‘చీపెస్ట్ లిక్కర్’ను అటాచ్ చేయాలని అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. గ్రామాల్లో ప్రత్యేకంగా ఔట్లెట్లను ఏర్పాటు చేయడం వల్ల నాటుసారాకు చెక్ పడుతుందని ఆబ్కారీ శాఖ భావిస్తోంది. అయితే ఈ ఔట్లెట్లను వేలం విధానం ద్వారా కాకుండా.. ప్రస్తుత తరహాలో లాటరీ పద్ధతిలో వ్యాపారులకు అందజేయాలని యోచిస్తున్నారు. వేలం పద్ధతి తీసుకొస్తే ఎమ్మార్పీని పాటించకుండా ఇష్టానుసారంగా మద్యాన్ని విక్రయించే అవకాశం ఉంటుందని వారు నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం.
రెవెన్యూ తగ్గుతుందని తెలిసినా..
ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం దుకాణాల ద్వారా చీప్‌లిక్కర్‌ను విక్రయిస్తున్నారు. 180 ఎంఎల్ (క్వార్టర్) చీప్ లిక్కర్ ధర రిటైల్ మార్కెట్లో రూ. 80 నుంచి రూ. 110 వరకు ఉంది. కానీ పేదవర్గాలు, కార్మికులు అంత మొత్తం చెల్లించి చీప్ లిక్కర్‌ను కొనుగోలు చేయలేక పది, ఇరవై రూపాయలకు లభించే నాటుసారా (గుడుంబా)కు బానిసలవుతున్నారు. అయితే ఎక్సైజ్ రెవెన్యూలో 40 శాతానికిపైగా వాటా చీప్ లిక్కర్దే. దేశీదారు తరహాలో ‘చీపెస్ట్’ లిక్కర్‌ను తీసుకురావడం వల్ల రూ. 80 నుంచి రూ. 110 వరకూ చెల్లించి మద్యం సేవించేవారు... ఆ ‘చీపెస్ట్ లిక్కర్’వైపు మళ్లడం ఖాయం. దాంతో రూ. 800 కోట్ల నుంచి రూ. 2,000 కోట్ల వరకు మద్యంపై ఆదాయం తగ్గుతుందని ఆర్థికశాఖ అంచనా. కానీ నాటుసారా వల్ల ప్రజారోగ్యం నాశనమవుతుందని భావిస్తున్న ప్రభుత్వం మాత్రం రెవెన్యూ తగ్గినా అధికారికంగానే తక్కువ ధరలో మద్యం అందించేందుకు మొగ్గు చూపుతోంది.