►జంతు కళేబరాలతో నూనె తయారీ కేంద్రంపై అధికారుల దాడులు ►ఉదయమే పరారైన నిర్వాహకులు ► అధికారుల విచారణలో మరిన్ని నిజాలు ►పత్తాలేని ఫుడ్ ఇన్...

►జంతు కళేబరాలతో నూనె తయారీ కేంద్రంపై అధికారుల దాడులు
►ఉదయమే పరారైన నిర్వాహకులు
► అధికారుల విచారణలో మరిన్ని నిజాలు
►పత్తాలేని ఫుడ్ ఇన్స్పెక్టర్
జడ్చర్ల : జంతు కళేబరాలతో నూనె తయారుచేసి.. వంటనూనెలుగా బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న ఉదంతంపై సోమవారం ‘సాక్షి’లో ‘కాలకూటం’ శీర్షికన ప్రచురితమైన కథనం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ అక్రమదందా వెలుగుచూడటంతో నిర్వాహకులు బెంబేలెత్తిపోయారు. సోమవారం ఉదయమే ఫ్యాక్టరీకి తాళాలు వేసుకుని పరారయ్యారు. ఈ కథనంతో రెవెన్యూ అధికారులు ఉరుగులు పరుగులు పెట్టారు.
పక్కాసమాచారంతో నూనె తయారీకేంద్రంపై దాడులకు ఉపక్రమించారు. జడ్చర్ల మండలం వల్లూరు పంచాయతీ శివారు గుట్టల్లో గుట్టుగా సాగుతున్న నూనె తయారీ కేంద్రంపై స్థానిక తహశీల్దార్ జగదీశ్వర్‌రెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం విచారణ చేపట్టింది. ఆర్ఐ శ్రీనువాసులు, వీఆర్ఓలు రమేశ్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డిలతో కలిసి నూనెతయారీ విధానం, అందుకోసం ఉపయోగించే పాత్రలు, ప్యాకింగ్ చేసే డబ్బాలు, కొత్తగా నిర్మిస్తున్న మరోకేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. తాము విచారించిన అంశాలు, ఇందుకు సంబంధించిన పూర్తినివేదికను జిల్లా ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలియజేశారు. అంతేగాక పరిశ్రమల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి నుంచి వివరాలు సేకరిస్తామన్నారు.
స్థానికుల ఆగ్రహావేశాలు
జడ్చర్లను అడ్డాగా చేసుకుని జంతుకళేబరాలతో నూనె తయారుచేసి.. ప్రజలకు వంటనూనెలుగా అంటగడుతున్న తీరు ప్రజలను కలవరపాటుకు గురిచేసింది. వివిధ ప్రాంతాల నుంచి వాహనాల్లో జంతుకళేబరాలను ఇక్కడికి తీసుకొచ్చి పెద్ద పెద్ద బాణాలలో వాటిని ఉడికించి.. ఆరిన తరువాత నూనెను తీసి డబ్బాల్లో ప్యాక్‌చేసి విక్రయిస్తున్నారని వివరించారు. అంతేగాక తయారీ సమయంలో తీవ్రదుర్గంధం వెదజల్లుతోందని.. ఆ వాసన ను భరించలేకపోతున్నామని వాపోయారు.
ఎలాగైనా ఇక్కడి నుంచి నూనె తయారీకేంద్రాన్ని తరలించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, జంతుకళేబరాలతో నూనె తయారీ చేస్తున్న ఉదంతం బయటకు పొక్కడంతో నిర్వాహకులు, వారి మద్దతుదారులు గప్.. చుప్! అయ్యారు. నిర్వాహకులు ఉదయమే వచ్చి భవనానికి తాళాలు వేసుకుని వెళ్లారు.
మంత్రి దృష్టికి సమస్య
జడ్చర్ల ప్రాంతంలో జంతుకళేబరాలతో నూనె తయారీ చేస్తున్న విషయాన్ని కొందరు స్థానిక నాయకులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో ఆయన విశయాన్ని ఆరాతీసి.. చర్యలకు ఆదేశించినట్లు తెలిసింది.
జాడేలేని ఫుడ్ ఇన్స్పెక్టర్
కళ్లకు కట్టినట్లు కథనాలు కనిపించినా సంబంధిత ఫుడ్ ఇన్స్పెక్టర్, ఇతర అధికారులు ఎంతమాత్రం స్పందించకపోవడం పట్ల ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటి నూనెల తయారీ కేంద్రాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మౌనం దాల్చడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ స్పందించి ఇలాంటి కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.