(27 Mar) జగన్ అక్రమాస్తుల కేసులో ఇందూ ఆస్తులపై ఈడీ ఉత్తర్వులుజప్తులో లేపాక్షికి కేటాయించిన 8,648 ఎకరాలుకూకట్పల్లిలో టౌన్షిప్ నిర్మాణ...
(27 Mar) జగన్ అక్రమాస్తుల కేసులో ఇందూ ఆస్తులపై ఈడీ ఉత్తర్వులుజప్తులో లేపాక్షికి కేటాయించిన 8,648 ఎకరాలుకూకట్పల్లిలో టౌన్షిప్ నిర్మాణాలుమహారాష్ట్రలో 25 ఎకరాలుఅక్రమ మార్గాల్లో నిధుల మళ్లింపు వాస్తవమేనని వెల్లడిఈనాడు, హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో ఇందూ గ్రూపునకు చెందిన సుమారు రూ.130 కోట్ల స్థిర, చరాస్తులను తాత్కాలిక జప్తు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు రూ.129 కోట్ల విలువైన మూడు స్థిరాస్తులు, రూ.కోటి విలువైన నగదును జప్తు చేసింది. రూ.113 కోట్ల విలువగా లెక్కిస్తూ లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు చెందిన అనంతపురంలోని 8648.81 ఎకరాలను జప్తు చేస్తూ ఈడీ జాయింట్ డైరెక్టర్ కె.ఎస్.వి.వి.ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మహారాష్ట్రలోని హింగనలో ఆసరా రియల్టీ వెంచర్స్‌కు చెందిన రూ.11 కోట్ల విలువైన 25 ఎకరాల భూమిని, గృహనిర్మాణ మండలి, ఇందూ గ్రూపు సంయుక్త భాగస్వామ్యంతో రంగారెడ్డి జిల్లా కూకట్‌పల్లిలో 2.57 ఎకరాల్లో సైబరాబాద్ హైటెక్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (చిడ్కో) చేపట్టిన రూ.3.85 కోట్ల విలువైన 14196 చదరపు అడుగుల నిర్మాణాలను జప్తు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు ఆగ్రో ఫుడ్ పార్కు నుంచి రావాల్సిన రూ.64 లక్షలు, జెన్ స్కిల్ప్రోక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రావాల్సిన రూ.37 లక్షల నగదును కూడా జప్తు చేసింది. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన ప్రభుత్వ హయాంలో ఇందూ గ్రూపు ఛైర్మన్ శ్యాంప్రసాద్‌రెడ్డికి పలు ప్రాజెక్టులను అడ్డగోలుగా కేటాయించిందని సీబీఐ మూడు అభియోగ పత్రాలను దాఖలు చేసింది. వైఎస్ ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధికి ప్రతిఫలంగా ముడుపులను పెట్టుబడులుగా వైఎస్ కుమారుడైన జగన్ కంపెనీలకు రూ.70 కోట్లు ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి చెల్లించారు. ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డికి అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ నిమిత్తం 8844 ఎకరాలను ఏపీఐఐసీ కేటాయించింది. కేవలం రూ.119 కోట్లు చెల్లించి ఈ భూమిని తీసుకున్న శ్యాంప్రసాద్‌రెడ్డి.. ఆ భూమిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ.790 కోట్లు రుణం తీసుకున్నారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన అభియోగ పత్రం ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.గ్రూపు కంపెనీల ద్వారా మనీ లాండరింగ్శ్యాంప్రసాద్రెడ్డికి చెందిన పలు కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ దర్యాప్తులో తేల్చింది. ఇందూ గ్రూపులోని లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్, లేపాక్షి ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్, లేపాక్షి సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్, లేపాక్షి హెరిటేజ్ వెల్నెస్ విలేజ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇందూ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌ల ద్వారా ఏపీఐఐసీ కేటాయించిన భూములను బదలాయించడం, విక్రయించడంతోపాటు భూములను తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి పొందిన రుణాలను ప్రాజెక్టు నిమిత్తం కాకుండా పాత అప్పులు తీర్చుకోవడానికి, ఇతర గ్రూపు కంపెనీలకు నిధులను తరలింపు.. జరిగిందని దర్యాప్తులో బయటపడిందని పేర్కొంది. ఇప్పటికే ఇందూ గ్రూపులోని ఇందూ టెక్‌జోన్‌కు చెందిన రూ.53 కోట్ల విలువైన ఆస్తులను ఫిబ్రవరిలో తాత్కాలిక జప్తు చేసిన ఈడీ.. ప్రస్తుతం లేపాక్షి నాలెడ్జ్ హబ్‌తోపాటు హౌసింగ్ ప్రాజెక్టు భూముల్లో కొంత మేర జప్తు చేసింది. హౌసింగ్ ప్రాజెక్టుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రం ద్వారా మరిన్ని ఆస్తుల జప్తు జరిగే అవకాశం ఉంది.
