లండన్ : బ్రిటిష్ పురాతత్వశాస్త్రవేత్తలు ప్రపంచలోనే మొట్టమొదటిసారిగా అతిపురాతనమైన మానవుడి మెదడును కనుగొన్నారు. 2500 ఏండ్లనాటి మనిషి మెదడు...
లండన్ : బ్రిటిష్ పురాతత్వశాస్త్రవేత్తలు ప్రపంచలోనే మొట్టమొదటిసారిగా అతిపురాతనమైన మానవుడి మెదడును కనుగొన్నారు. 2500 ఏండ్లనాటి మనిషి మెదడును గుర్తించారు. 2008లో బ్రిటన్‌లోని యార్క్‌లో జరిపిన తవ్వకాల్లో ఇనుపయుగం నాటి మానవుడి పుర్రె పూర్తిగా లభ్యమైంది. అది బురదలో కూరుకుపోయిన ఉండటంతో జాగ్రత్తగా బయటకుతీసి పరిశోధనలు మొదలుపెట్టగా అందులో మెదడు చెక్కుచెదరకుండా ఉందని తేలిపింది. ఈ మెదడు పాడవకుండా బురదే కాపాడిందని పరిశోధకులు అనుమానిస్తున్నారు. ఇదే నిజమైతే ప్రస్తుతం మెదడుపై జరుగుతున్న పరిశోధనలు గొప్ప మలుపు తిరుతాయని యార్క్ పురాతత్వ విభాగం పేర్కొంది.
