హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 2015-16 బడ్జెట్లో ప్రభుత్వం రూ.2,677.72 ...

లక్ష మంది బడికి దూరం
రాష్ట్రంలో గతేడాది 61,78,495 మంది విద్యార్థులు బడుల్లో చేరగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య 60,76,741కు పరిమితమైంది. డ్రాపౌట్స్ బాలికల్లో (36.41%)కంటే బాలురలోనే (38.85%) ఎక్కువగా ఉంది. 2000 నుంచి 2008 వరకు బడికి వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరగగా ఆ తర్వాత నుంచి తగ్గుతోంది.
‘మిషన్’ నిధులు పెరిగాయ్..!
కేటాయించిన నిధులు
రూ. 2083.13కోట్లు.. గత ఏడాది కంటే 67.13 కోట్లు అధికం
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయకు ప్రభుత్వం ఈ ఏడాది కూడా ఆశించిన స్థాయిలోనే నిధులు కేటాయించింది. గతేడాదితో పోల్చితే రూ.67.13 కోట్లు అధికంగా కేటాయింపులు జరిపింది. ఈ ఏడాది సైతం సుమారు 9,300 చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ పథకానికి మొత్తం సుమారు రూ.20 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం తొలి ఏడాది 9,305 చెరువులను పురుద్ధరించే లక్ష్యంతో 2014-15 బడ్జెట్లో రూ. 2,016 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది సైతం 9,308 చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం అందుకు తగ్గట్టే రూ.2,083 కోట్లు కేటాయించింది.
ఐటీకీ అరకొరే రూ.134కోట్లే కేటాయింపులు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచానికే ఐటీ గమ్యంగా హైదరాబాద్‌ను మారుస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం ఆ శాఖకు అరకొరగానే కేటాయింపులు చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖకు ఈ బడ్జెట్లో కేవలం రూ.134 కోట్లు కేటాయించి చేతులు దులుపుకొంది. ఇందులో ప్రణాళిక వ్యయం రూ.132కోట్లు కాగా, ప్రణాళికేతర వ్యయం రూ.2 కోట్లుగా చూపారు. సెక్రటేరియట్‌లోని ఐటీ అండ్ ఈసీ విభాగానికే ఎక్కువ మొత్తంలో రూ.131కోట్లు కేటాయించగా, ఎలక్ట్రానిక్ డెలివ రబుల్ సేవల విభాగానికి రూ.2 కోట్లు నిధులు దక్కాయి.
రెవెన్యూ విభాగానికి రూ.1,686 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ విభాగానికి బడ్జెట్లో రూ.1,686.80 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రణాళికేతర వ్యయం 1,437.56 కోట్లు కాగా, ప్రణాళిక వ్యయం కింద రూ.249.24 కోట్లు చూపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా అమరులైన వారికి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే నిమిత్తం ప్రభుత్వం రూ.90 కోట్లను బడ్జెట్లో కేటాయించింది. యాదగిరిగుట్టను టెంపుల్ సిటీగా తీర్చిదిద్దే నిమిత్తం ఏర్పాటుచేసిన అధారిటీకి రూ.100 కోట్లు కేటాయించారు.
పన్నులు పెంచక తప్పదు: ఈటెల
కొత్త రాష్ట్రంపై ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షలను నెరవేర్చడానికి పన్నులు పెంచక తప్పదు. ప్రభుత్వానికి ఆదాయం గాల్లోంచి ఊడిపడదు. ఎక్సైజ్, పెట్రో ఉత్పత్తులపై పన్నుల ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువగా ఆదాయం వస్తున్నది గనుకనే పెట్రో ఉత్పత్తులపై పన్నులు పెంచాల్సి వచ్చింది.
అధ్యయనం చేశాకే స్పందిస్తా : జానారెడ్డి
పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే బడ్జెట్‌పై స్పందిస్తాను. ప్రభుత్వం ఏ రంగానికి ఎంత కేటాయించిందో, గత ఆర్థిక సంవత్సరంలో ఎంత ఖర్చు చేసిందో చూడాలి. బడ్జెట్ కేటాయింపులేమిటో తెలియకుండా ఆషామాషీగా మాట్లాడితే గౌరవప్రదం కాదు.