హైదరాబాద్ : సింగరేణి సంస్థ ప్రతిష్ఠను ఇనుమడింపజేసే విధంగా సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన 529వ బోర్డు సమావేశం పలు కీలక నిర్...
హైదరాబాద్ : సింగరేణి సంస్థ ప్రతిష్ఠను ఇనుమడింపజేసే విధంగా సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన 529వ బోర్డు సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింగరేణి సంస్థలో మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగులకు వారసత్వ ఉద్యోగాల స్థానంలో నేషనల్కోల్ వేజ్ అగ్రిమెంట్ (ఎన్సీడబ్ల్యూఏ) ప్రకారంగా ప్రస్తుతం ఇస్తున్న ఏకమొత్తాన్ని (లంప్సమ్)గా రూ.5 లక్షల నుంచి రూ.12.5 లక్షలకు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకున్నది. ఫిబ్రవరి 8న సింగరేణి జారీచేసిన ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న వారందర్ని రాతపరీక్షకు అనుమతించాలని బోర్డు నిర్ణయించింది. ఇదే విధానాన్ని భవిష్యత్తు ఉద్యోగాల భర్తీకి వర్తింపజేయనున్నారు. సింగరేణి నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి తొలి ఇరవైశాతం కోటాలో ఓపెన్ కేటగిరికి స్థానిక, స్థానికేతరులను అర్హులుగా పరిగణించాలని, మిగతా 80 శాతం పోస్టులను పూర్తిగా నాలుగు సింగరేణి (కోల్‌బెల్ట్) జిల్లాలకు చెందిన స్థానికులతోనే భర్తీచేయాలని సింగరేణి బోర్డు నిర్ణయించింది. వంద టన్నుల సామర్ధ్యం కలిగిన 39 డంపర్లను, ఒక క్యూబిక్ మీటర్ సామర్ధ్యం కలిగిన 48 సైడ్ డంపర్స్, ఆరు లోడ్హాల్ డంపర్లు (ఎల్‌హెచ్‌డీ), 75 టన్నుల సామర్ధ్యమున్న మొబైల్ క్రేన్, బ్లాస్టింగ్‌కు ఉపయోగించే అమోనియం నైట్రేట్ తదితర అంశాలు బోర్డు సమావేశంలో చర్చకు వచ్చాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ఖైరీగూడ ఓపెన్‌కాస్ట్ (ఓసీ), పద్మావతిఖని (అండర్గ్రౌండ్మైన్)లలో ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచాలని బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం ఖైరీగూడ ఓసీలో ఉన్న 2.5 మిలియన్ టన్నుల బొగ్గు సామర్ధ్యాన్ని 3.5 మిలియన్ టన్నులకు పెంచేందుకు రూ.133 కో ట్లు, పద్మావతిఖనిలో ప్రస్తు తం 3.75 లక్షల టన్నుల సామర్ధ్యాన్ని 8.5 లక్షల టన్నులకు పెంచేందుకు రూ. 114 కోట్లు కేటాయించింది. బోర్డు సమావేశానికి కేంద్ర బొగ్గుగనుల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి ఏకే భల్లా, తెలంగాణ ఇంధనశాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, కేంద్ర బొగ్గుగనుల మంత్రిత్వశాఖ సలహాదారు (ప్రాజెక్ట్స్) డీఎన్ ప్రసాద్, సింగరేణి డైరెక్టర్లు ఏ మనోహర్‌రావు (ప్లానింగ్, ప్రాజెక్ట్స్, ఫైనాన్స్), బీ రమేష్‌కుమార్ (ఆపరేషన్స్, పా), పీ రమేష్‌బాబు (ఈ అండ్ ఎం) పాల్గొన్నారు.
Key Tags
in singareni, 80% of the jobs, in the local