Mancherial Road హైదరాబాద్: గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకోసం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మున్సి...
![]() |
| Mancherial Road |
హైదరాబాద్: గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకోసం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో సీసీరోడ్లకు రూ.9.36కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. గౌతమహేశ్వరటెంపుల్ నుంచి గోదావరి నది వరకు సీసీరోడ్డు నిర్మాణానికి రూ.5.57కోట్లు, ైఫ్లెఓవర్ జంక్షన్ నుంచి ప్రభుత్వ డిగ్రీకాలేజీ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.3.79కోట్లు మంజూరు అయ్యాయి.
