పుట్టించిన బ్రహ్మ కు కూడా తెలుసో తెలియదో కాని ఆ విషయాని వైద్యులు గుర్తించారు. అమ్మాయి…అబ్బాయి గా మరినాడు. పుట్టింది అమ్మాయే అనుకుని, జుట...
పుట్టించిన బ్రహ్మ కు కూడా తెలుసో తెలియదో కాని ఆ విషయాని వైద్యులు గుర్తించారు. అమ్మాయి…అబ్బాయి గా మరినాడు. పుట్టింది అమ్మాయే అనుకుని, జుట్టు పెంచి జడలు వేసి, రంగురంగుల డ్రస్సులు వేసి మురిసిపోయారు తల్లిదండ్రులు. 17 ఏళ్ల పాటు కంటికి రెప్పలా చూసుకున్న, అమ్మాయిని అమ్మాయి కాదు అబ్బాయి అని ఇప్పుడు వైద్యులు తేల్చి చెప్పడంతో తల్లిదండ్రులే కాక ఆ ఊరివారంతా అవాక్కయ్యారు. వైద్య చరిత్రలో అత్యంత అరుదుగా జరిగే ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండల పరిధిలోని బాగిర్తిపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన నాగులు, భాగ్యమ్మ దంపతుల కుమార్తె భవాని పెరిగి పెద్దదైంది. మెదక్ లో బీఎస్సీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. మూడు నెలల క్రితం తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెను హైదరాబాదుకు తీనుకురాగా, ఆమె అమ్మాయి కాదు, అబ్బాయని డాక్టర్లు నిర్ధారించారు. బాలుడిగా జన్మించిన అతని పురుషాంగం శరీరంలోనే ఉండిపోయిందని చెప్పి, శస్త్రచికిత్స చేసి పురుషాంగాన్ని బయటికి తీయడంతో, భవాని ఇప్పుడు భానుప్రసాద్ గా మారాడు. మరో రెండు ఆపరేషన్లు చేస్తే భాను ప్రసాద్ పూర్తి పురుషుడిగా మారిపోతాడని వైద్యులు వెల్లడించారు. ఏది ఏమైనా అమ్మాయి కాస్తా అబ్బాయిగా మారడంపై భాను తల్లి సంతోషం వ్యక్తం చేశారు.మిగిత రెండు ఆపరేషన్ల్ చేయించుకునే స్థోమత లేకపోవడంతో దాతలసహయం కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తుంది.
photo courtery : expresstv.com
