- వాణిజ్యశాఖ పటిష్ఠానికే ఇన్ఫార్మర్ల వ్యవస్థ.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడి online business హైదరాబాద్: ఆన్లైన్ బిజినెస్...
- వాణిజ్యశాఖ పటిష్ఠానికే ఇన్ఫార్మర్ల వ్యవస్థ.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడి
![]() |
| online business |
హైదరాబాద్: ఆన్లైన్ బిజినెస్‌పై త్వరలో చట్టం తీసుకురావాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని వాణిజ్య, పన్నులశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. వాణిజ్య, పన్నులశాఖను పటిష్ఠం చేసేందుకే తాము ఇన్ఫార్మర్ల వ్యవస్థను ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పన్నుల వసూలు, ఆన్లైన్ బిజినెస్, ఇన్ఫార్మర్ల వ్యవస్థపై మంగళవారం శాసనమండలిలో ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్‌రావు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి తలసాని సమాధానమిచ్చారు.
వాణిజ్య, పన్నులశాఖను ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. ఆ క్రమములోనే సంస్కరణలు చేపడుతున్నట్లు చెప్పారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనకు చాలా సమాచారం అందిందన్నారు. సభ్యుల సూచన మేరకు ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తామని, స్కాన్ చేసేందుకు స్కానర్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
