mithali raj ఖైరతాబాద్, మార్చి 23: భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ గెలిస్తే ప్రపంచ కప్ మనమే కైవసం చేసుకోవచ్చునని భారత మహ...
![]() |
| mithali raj |
ఖైరతాబాద్, మార్చి 23: భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ గెలిస్తే ప్రపంచ కప్ మనమే కైవసం చేసుకోవచ్చునని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిధాలిరాజ్ అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రైతుకవి వట్టికూటి సాంబశివరావు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌పై రచించిన భారత రత్నం పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. 2011 భారత జట్టు ప్రపంచకప్ గెలుచుకున్న విశేషాలను వివరిస్తూ రచించిన జయహో భారత్ పుస్తకాన్ని ఆంధ్రజ్యోతి సంపాదకుడు శ్రీనివాస్ ఆవిష్కరించారు. ప్రస్తుతం భారత జట్టు బాగా రాణిస్తుందని, బౌలర్లు, బ్యాట్స్మెన్లు తమ సత్తా చాటుతూ దూకుడుగా ఉన్నారని చెప్పారు. మరికొంత శ్రమిస్తే ఈసారి ప్రపంచకప్ మన సొంతం కావడం ఖాయమని అన్నారు. వేలాది మంది వీక్షించే క్రికెట్ ఆటపై పద్యరూపంలో రచన చేయడం తనకెంతో ఆనందంగా ఉందని రచయిత వట్టికూటి సాంబశివరావు పేర్కొన్నారు.
