సీపీఐ మహాసభల్లో జాతీయ నేత నారాయణ ఖమ్మం: ‘తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజలకు మేలు చేస్తుందన్న భ్రమలు తొలగిపోయూరుు. గత పాలకులకు, ఈ ప్రభుత్వా...

ఖమ్మం: ‘తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజలకు మేలు చేస్తుందన్న భ్రమలు తొలగిపోయూరుు. గత పాలకులకు, ఈ ప్రభుత్వానికి తేడా ఏమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వంపై ఇక పోరాటం చేయడమే తరువారుు.’ అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ కె.నారాయణ పార్టీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఖమ్మంలో నాలుగురోజులుగా నిర్వహిస్తున్న సీపీఐ మహాసభల్లో చివరిరోజు మంగళవారం ఆయన మాట్లాడారు.
కేసీఆర్ ప్రభుత్వం మేలును మరచి నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. దళితులకు నామమాత్రంగా భూపంపిణీ చేసి చేతులు దులుపుకుందన్నా రు. మహాసభల ద్వారా ఐక్య ఉద్యమాలకు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. ఈ సభలో పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, సహయ కార్యదర్శులు సిద్ది వెంకటేశ్వర్లు, పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబ శిరావు, అజీజ్‌పాషా, జి.మల్లేష్, పశ్య పద్మ, ఈర్ల నర్సింహ, రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు బాగం హేమంతరావు పాల్గొన్నారు.