-150 మంది ప్రయాణికులు మృతి -ఆల్ఫ్స్ పర్వతాల్లో కూలిపోయిన జర్మనీ విమానం - 1400 మీటర్ల ఎత్తులో మంచు నదిలో శకలాలు - దిగ్భ్రాంతి వ్యక్తంచేసి...
-150 మంది ప్రయాణికులు మృతి
-ఆల్ఫ్స్ పర్వతాల్లో కూలిపోయిన జర్మనీ విమానం
- 1400 మీటర్ల ఎత్తులో మంచు నదిలో శకలాలు
- దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ఫ్రాన్స్, జర్మనీ దేశాధినేతలు
- మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం
ప్యారిస్, మార్చి 24: ఫ్రాన్స్‌లో మంగళవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో దాదాపు 150 మంది ప్రయాణికులు మరణించారు. 144 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో స్పెయిన్ తీరప్రాంత నగరం బార్సిలోనా నుంచి జర్మనీలోని డుస్సెల్డార్ఫ్కు బయలుదేరిన జర్మన్వింగ్స్ సంస్థకు చెందిన ఎయిర్‌బస్ ఏ320 విమానం ఫ్రాన్స్ భూభాగంలోని ఆల్ఫ్స్ పర్వత సానువుల్లో కూలిపోవటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విమానంలో జర్మనీ, స్పెయిన్, టర్కీ పౌరులు ప్రయాణిస్తున్నట్లు భావిస్తున్నారు.-ఆల్ఫ్స్ పర్వతాల్లో కూలిపోయిన జర్మనీ విమానం
- 1400 మీటర్ల ఎత్తులో మంచు నదిలో శకలాలు
- దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ఫ్రాన్స్, జర్మనీ దేశాధినేతలు
- మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం
1400 మీటర్ల ఎత్తులో ప్రమాదం
బార్సిలోనా నుంచి డుస్సెల్డార్ఫ్కు బయలుదేరిన 4యూ 9525 విమానంతో మంగళవారం ఉదయం 10.30 (స్థానిక కాలమానం) సమయంలో కంట్రోల్‌రూంకు సంబంధాలు తెగిపోయాయని జర్మన్వింగ్స్ సంస్థ అధికారులు తెలిపారు. ఆ సమయంలో విమానం 5000 అడుగుల ఎత్తులో ఎగురుతున్నదని వెల్లడించారు.
Key Tags
Deadly air accident , France , 150 passengers died , Germany downed ,aircraft in the Alps