ప్రపంచకప్‌ విశ్వ విజేత ఆస్ట్రేలియా

(29 Mar) ఐదోసారి ప్రపంచకప్‌ కైవసం చేసుకున్న ఆసీస్‌మెల్‌బోర్న్‌లో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఆస్ట్రేలియా కప్‌ను కైవ...

(29 Mar) ఐదోసారి ప్రపంచకప్‌ కైవసం చేసుకున్న ఆసీస్‌మెల్‌బోర్న్‌లో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఆస్ట్రేలియా కప్‌ను కైవసం చేసుకుంది. 16.5 ఓవర్లు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. యువ సంచలనం స్మిత్‌.. సౌథీ బౌలింగ్‌లో బౌండరీ కొట్టి విజయానికి కావాల్సిన పరుగులు సాధించాడు. ఎలాంటి ఉత్కంఠ లేకుండా సాదాసీదాగా ముగిసిన ఫైనల్‌లో ఆసీస్‌ అన్ని రంగాల్లో న్యూజిలాండ్‌పై పైచేయి సాధించి ఈ విజయాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటి వరకూ జరిగిన 11 ప్రపంచకప్‌ల్లో ఆస్ట్రేలియా కప్‌ను సాధించటం ఇది ఐదో సారి.క్లార్క్‌ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌..అనుకున్నట్లుగానే ఇదే తన ఆఖరి మ్యాచ్‌ అని ప్రకటించిన కెప్టెన్‌ క్లార్క్‌కు కలకాలం గుర్తిండిపోయేలా ఆటగాళ్లు సంయుక్తంగా ఈ విజయాన్ని అందించారు. క్లార్క్‌ కూడా మంచి ఇన్నింగ్స్‌ ద్వారా తన వన్డే కెరీర్‌ను ముగించాడు. ఫైనల్‌లో క్లార్క్‌ 74 పరుగులు సాధించటం విశేషం. లీగ్‌ మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌పై ఓటమి చవిచూసిన ఆసీస్‌ జట్టు ఫైనల్‌లో అదే జట్టును ఓడించి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఇప్పటి వరకూ అద్భుతంగా ఆడుతూ వచ్చిన న్యూజిలాండ్‌.. తమ దేశం బయట జరిగిన ఫైనల్స్‌లో ఆ ఆటతీరును చూపించలేకపోయింది. సొంత మైదానాల్లో సొంత ప్రేక్షకుల మధ్య వరుస విజయాలు సాధించిన న్యూజిలాండ్‌ మెల్‌బోర్న్‌లో మాత్రం అన్ని రంగాల్లో విఫలమై ఒక సాధారణ జట్టులా కనిపించింది.టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ ఆరంభ ఓవర్లలోనే కెప్టెన్‌ మెక్‌కలమ్‌ వికెట్‌ కోల్పోయి మరి ఏ దశలోనూ కోలుకోలేదు. అద్భుతమైన స్వింగ్‌ బౌలింగ్‌తో ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్లు న్యూజిలాండ్‌ ఆటగాళ్లను చక్రబంధంలో ఇరికించారు. ఓ దశలో బ్యాట్స్‌మెన్లకు పరుగులు తీయటమే గగనంగా మారింది. జాన్సన్‌, స్టార్క్‌, హేజిల్‌వుడ్‌, ఫాల్క్‌నర్‌లు యార్కర్లు, షార్ట్‌ పిచ్‌ బంతులు, స్లో బంతులు, లెన్త్‌ బాల్స్‌తో న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్లపై విరుచుకుపడ్డారు. ఒక ఇలియట్‌ తప్ప మిగతవారు ఆసీస్‌ బౌలర్లను నిలువరించలేకపోయారు. మూడు వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన టేలర్‌, ఇలియట్‌లు కొంత సేపు ప్రతిఘటించారు. టేలర్‌ ఔట్‌తో మిగతా బ్యాట్స్‌మెన్లు ఒక్కొక్కరుగా పెవిలియన్‌ ముఖం పట్టారు. 183 పరుగులకే ఆలౌట్‌ అయి ఆసీస్‌కు పోరాటం ప్రదర్శించే అవకాశం లేకుండా చేశారు.అలవోకగా లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్‌..ఆసీస్‌ ఆరంభంలోనే ఫించ్‌ వికెట్‌ను కోల్పోయినా.. వార్నర్‌ తాను ఉన్నంత సేపు ధాటిగా ఆడి స్కోరును పెంచాడు. వార్నర్‌ ఔట్‌తో బరిలోకి వచ్చిన క్లార్క్‌, స్మిత్‌లు బౌలర్లకు మరో అవకాశం ఇవ్వలేదు. క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత ముఖ్యంగా క్లార్క్‌ కివీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇంకా 16.5 ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని అందించటంలో తన పాత్ర వహించాడు. స్మిత్‌ చివరి వరకు ఉండి గెలుపునకు కావాల్సిన పరుగులు చేసి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు.బౌలింగ్‌, ఫీల్డింగ్‌, బ్యాటింగ్‌లో ఆసీస్‌ ఛాంపియన్‌ ఆట తీరు కనబరిచింది. ఆసీస్‌ ప్రపంచకప్‌ గెలవడానికి పూర్తిగా ఆర్హత ఉందని మరోసారి నిరూపించింది. సొంత మైదానం, సొంత ప్రేక్షకుల మధ్య ఆడినా.. జట్టు ప్రదర్శించిన సాంకేతిక ప్రదర్శన అద్భుతమని చెప్పవచ్చు. స్మిత్‌ రూపంలో తన జట్టుకు ఒక అద్భుతమైన నాయకుడు లభించటం విశేషం. టెస్టుల్లో, వన్డేల్లో, ప్రపంచకప్‌లో స్మిత్‌ తన సామర్థ్యాన్ని ప్రదర్శించి నాయకత్వానికి తాను అర్హుడని రుజువు చేశాడు. ప్రస్తుతం టెస్టులకు స్మిత్‌ నాయకత్వం వహిస్తుండగా.. టీ20ల్లో బెయిలీ కెప్టెన్‌గా ఉన్నాడు. క్లార్క్‌ రిటైర్మెంట్‌తో వన్డేలకు కూడా బహుశా స్మిత్‌ నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి.సొంత గడ్డపై ఆకట్టుకుని.. విదేశీ గడ్డపై చేతులెత్తేసి..న్యూజిలాండ్‌ ఫైనల్‌లో మంచి ఆటతీరు ప్రదర్శించకపోయినా లీగ్‌ మ్యాచ్‌ల్లో తన జట్టు బౌలింగ్‌, బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించింది. మెక్‌కలమ్‌ మెరుపు ఇన్నింగ్స్‌, బౌల్డ్‌, సౌథీల బౌలింగ్‌ మెరుపులు జట్టు సామర్థ్యాన్ని వెల్లడిచేశాయి.ప్రపంచకప్‌లో భారత్‌కూడా తాను ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో గొప్ప ఆటతీరు ప్రదర్శించినా సెమీస్‌లో నిలకడ ప్రదర్శించలేకపోవటం ఒక్కటే లోపం. ప్రస్తుత భారత జట్టు యువకులతో కూడకున్నది. భారత్‌ భవిష్యత్‌లో అద్భుతమైన జట్టుగా రూపుదిద్దుకునే అవకాశాన్ని కొట్టివేయలేం. పాక్‌ జట్టులో బౌలింగ్‌ బాగున్నా.. బ్యాటింగ్‌ ఏ మాత్రం ప్రపంచస్థాయిలో లేకపోవటం ఆ జట్టుకున్న బలహీనతని చెప్పుకోవచ్చు. ఎంతో అద్భుతమైన బ్యాట్స్‌మెన్లను ఇచ్చిన పాక్‌.. ప్రస్తుతం అంత సామర్థ్యం లేని ఆటగాళ్లతో ఉంది. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం గ్రహించాలి. చివర వరకూ వచ్చి చతికలబడే అలవాటు ఉన్న దక్షిణాఫ్రికా ఈ సారి భారత్‌, న్యూజిలాండ్‌పై ఓటమి తప్ప ఛాంపియన్‌ ఆటతీరును కనబరించింది. ముఖ్యంగా ప్రపంచకప్‌ మొత్తంమీద చెప్పుకోదగ్గ మ్యాచ్‌గా గుర్తిండిపోయే తొలి సెమీస్‌లో జట్టు విజయాన్ని అందుకునే దశ వరకూ వచ్చి ఆగిపోయింది. జట్టు కెప్టెన్‌ డివిలియర్స్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో పాటు ముందు ఉండి నడిపించిన తీరు కూడా అమోఘం. ఈ సారి కూడా ప్రపంచకప్‌ వారికి దక్కకపోవడటం ఓ రకంగా దురదృష్టం. అయితే గెలవడానికి అన్ని హంగులు ఉన్న జట్లలో దక్షిణాఫ్రికా ఒకటి. సంగక్కర, జయవర్ధనేల రిటైర్మెంట్‌తో శ్రీలంక ఆఖరి అంకానికి చేరుకుందా అని కనిపించింది. ప్రపంచకప్‌ల్లో అద్భుతమైన ఆటతీరు కనబరిచిన శ్రీలంక ఈ దిగ్గజాల నిష్క్రమణతో కళ కోల్పోనుందా అని అనిపిస్తోంది. యువకుల్లో నిలబడి ఆడే ఆటగాళ్లు లేకపోవటం భవిష్యత్‌లో ఆ జట్టులో ప్రధాన లోపం. విండీస్‌ జట్టు ఎప్పటిలాగే అనేక ఒడిదొడుకులతో కూడికుని ఉంది. హోల్డర్‌ నాయకత్వంలో ఆ జట్టు చాలా పేలవంగా కనిపించింది. ఒకప్పటి అద్భుత ప్రదర్శన ఈ జట్టులో లేకపోవటం గమనార్హం. బౌలింగ్‌, బ్యాటింగ్‌ రెండూ దిశ, దశ లేని తీరులో ఉన్నాయి. గేల్‌ డబుల్‌ సెంచరీ చేయటం ఒక్కటే ఈ ప్రపంచకప్‌లో వారికి లభించిన వూరట. క్రికెట్‌కి పుట్టినిల్లుగా భాషించిన ఇంగ్లాండ్‌ ప్రదర్శన ఈ ప్రపంచకప్‌లో అత్యంత నిరాశతో కూడుకున్నది. లీగ్‌ మ్యాచ్‌ దశలో కూడా రాణించలేకపోవటం ఆ జట్టు కూర్పు, ఆటతీరుపై యాజమాన్యం పూర్తి సమీక్ష చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. అండర్‌సన్‌, ఇయాన్‌ బెల్‌ లాంటి సమర్థమైన ఆటగాళ్లున్న జట్టు చాలా పేలవంగా కనిపించింది. కెప్టెన్‌ మోర్గాన్‌ నాయకత్వం కూడా అంత సమర్థంగా లేదనిపించింది. బంగ్లాదేశ్‌ జట్టు క్వార్టర్‌ ఫైనల్స్‌ వరకూ వచ్చి మంచి ఆటతీరు కనబరిచింది. భవిష్యత్‌లో ఆ జట్టు మరిన్ని విజయాలు సాధించడానికి ఇది ఉత్ప్రేరకంగా పనిచేయవచ్చు. చిన్న జట్లలో ఐర్లాండ్‌ ఒకటి. పెద్దజట్లను ఓడించగలిగిన సత్తా తమకు ఉందని ప్రకటించింది. మొత్తం మీద 2015 ప్రపంచకప్‌ ప్రేక్షకుల ఆకాంక్షల మేరకు సాగిందనే చెప్పాలి. సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు అంత ఉత్కంఠ కలిగించకపోయినా.. లీగ్‌ దశలో కొన్ని పోటీలు ఆసక్తికరంగా సాగాయి. ఎన్నడూ లేనంతగా రెండు డబుల్‌ సెంచరీలు ఈ ప్రపంచకప్‌లో నమోదు కావటం విశేషం. వెస్టిండీస్‌ ఆటగాడు గేల్‌, న్యూజిలాండ్‌ ఆటగాడు గప్తిల్‌ ఈ ఘనత సాధించారు. చిన్న మైదానాలు.. ఫీల్డింగ్‌ నిబంధనలను ఆసరాగా తీసుకుని క్రికెట్‌ పూర్తిగా బ్యాట్స్‌మెన్ల పక్షపాతి క్రీడగా మారిందని.. ఈ ఫీల్డింగ్‌ నిబంధనల మీద సమీక్షించాలని కొంత మంది నిపుణులు కోరుతున్నారు. ఫీల్డింగ్‌ నిబంధనలు ఆసరాగా చేసుకుని మిస్‌ హిట్స్‌ కూడా సిక్స్‌లు, ఫోర్లు పోతుండటాన్ని వీరు ఎత్తి చూపుతున్నారు. అయితే ఆటను చూడటానికి ప్రేక్షకులు రావాలంటే వేగంగా పరుగుల వరద పారించటం తప్పదని ఐసీసీ భావిస్తుందనుకుంటా!.-ఫోర్త్‌ అంపైర్‌మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఫాల్క్‌నర్‌(ఆస్ట్రేలియా) ప్లేయర్‌ ఆఫ్‌ది టోర్నమెంట్‌ స్టార్క్‌(ఆస్ట్రేలియా)

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: ప్రపంచకప్‌ విశ్వ విజేత ఆస్ట్రేలియా
ప్రపంచకప్‌ విశ్వ విజేత ఆస్ట్రేలియా
http://2.bp.blogspot.com/-fg9atAQAyUo/VRiJb3434iI/AAAAAAAAEp0/qNnufwR0EkM/s1600/350x350_IMAGE37822404.png
http://2.bp.blogspot.com/-fg9atAQAyUo/VRiJb3434iI/AAAAAAAAEp0/qNnufwR0EkM/s72-c/350x350_IMAGE37822404.png
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/03/blog-post_183.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/03/blog-post_183.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy