గోదావరి నది పుష్కరాలకు మరో నాలుగు నెలల సమయం ఉంది. తెలంగాణ ఆవిర్భావం తరవాత వస్తున్న ఈ పుణ్యకార్యాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు రా...
గోదావరి నది పుష్కరాలకు మరో నాలుగు నెలల సమయం ఉంది. తెలంగాణ ఆవిర్భావం తరవాత వస్తున్న ఈ పుణ్యకార్యాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమయాత్తమవుతోంది. వందరోజుల గడువులోగా పని పూర్తిచేయాల్సిన పరిస్థితుల్లో ఇప్పటికీ కొన్నిచోట్ల పుష్కర పనులు మొదలుకాలేదు. ప్రధాన వేదికలైన బాసర, కందకుర్తి, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలంలో పనులు టెండర్ల దశలోనే ఉన్నాయి. అయితే గోదావరి పుట్టిల్లు, మన పొరుగు రాష్ట్రమైనా మహారాష్ట్రలో పుష్కర పనులు చివరి దశలో ఉన్నాయి. నదీ తీర ప్రాంతాలు, ప్రధాన పట్టణాలలో పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. గోదావరి జన్మస్థలమైన మహారాష్ట్రలో నాసిక్, నాందేడ్, తదితర ప్రాంతాల్లో సింహస్థ కుంభమేళా జరిగే పనులు యుద్ధప్రతిపాదికన కొనసాగుతున్నాయి.చీ/్డ్న్థ్మజి చ్డ్న్థ్మీ ్బై్శ్ఠ=ఖి+2ఖిజిపుష్కరాల నిర్వహణకు మహారాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను విడుదల చేసింది. ప్రత్యేకాధికారులను నియమించి పనులను శరవేగంగా పూర్తిచేయాలని సంకల్పించింది. ఆ మేరకు ఆరునెలల కిందటే పనులకు టెండరు ప్రక్రియలు పూర్తి చేసి సకాలంలో పనులు మొదలయ్యేలా చర్యలు తీసుకుంది. ఫలితంగా ప్రస్తుతం పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో పనులు చివరిదశకు చేరుకున్నాయి. కుంభమేళా జరిగే నాసిక్ పట్టణంలో మహా ప్రభుత్వం అభివృద్ధి పనుల నిమిత్తం భారీగా నిధులు వెచ్చించింది. నాసిక్ మున్సిపల్ కార్పోరేషన్ 1052.61 కోట్లను వెచ్చిస్తుండగా, నాసిక్ జిల్లా యంత్రాంగం 378 కోట్ల నిధులతో కుంభమేళా పనులను చేపట్టింది. రహదారుల నిర్మాణం, ఫ్త్లెఓవర్లు, వంతెనలు, పారిశుధ్య నిర్వహణ, పార్కింగ్ వసతులకు ఈ మొత్తం నిధులను వెచ్చిస్తున్నారు. పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించారు. అధికారిక వెబ్‌సైట్‌లను ఏర్పాటుచేసి పుష్కరాల విశిష్టతను, పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు అంతర్జాలంలో నిక్షిప్తం చేస్తున్నారు. మరో పట్టణం నాందేడ్‌తోపాటు ఆ జిల్లాలో సైతం పుష్కర పనులు శరవేగంగా సాగుతున్నాయి. నాందేడ్ పట్టణం, విష్ణుపురి ప్రాజెక్ట్ వద్ద స్నానఘట్టాల నిర్మాణం పూర్తయింది. రహదారులు విస్తరణ, తాగునీటి సౌకర్యానికి పైప్‌లైన్‌లు, తాత్కాలిక నిర్మాణాల పనులు చురుగ్గా సాగుతున్నాయి.చీ/్డ్న్థ్మజి చ్డ్న్థ్మీ ్బై్శ్ఠ=ఖి+2ఖిజిప్రస్తుతం మన రాష్ట్రంలో పుష్కర పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు టెండర్ల దశ ముగిసి పనులు ప్రారంభమయ్యాయి. పంచాయతీరాజ్, సాగునీటి, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులకు ఈ మధ్యనే నిధులు విడుదలయ్యాయి. కొన్ని పనులకు టెండర్లు పిలవగా ఎక్కువశాతం పనులు టెండర్ల గడపనే తొక్కలేదు. కేంద్రంనుంచి సకాలంలో ఆశించిన నిధులు రాకపోవటం కూడా అభివృద్ధి పనులకు ప్రతిబంధకం అవుతుంది. పుష్కరాలకు గడువు సమీపిస్తున్న ఇంకా పనులు మొదలుకాకపోవటం పుష్కర విజయవంతంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గత పుష్కరాల సమయంలో సైతం చివరి నిమిషంలో హడావిడిగా పనులు చేపట్టారు. దీంతో పనుల్లో నాణ్యత లోపం, సౌకర్యాల లేమితో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు అభివృద్ధి పనులను పరుగులు పెట్టించాల్సిన ఆవశ్యకత ఉంది.చీ/్డ్న్థ్మజి చ్డ్న్థ్మీ ్బై్శ్ఠ=ఖి+2ఖిజిగత పుష్కరాలు 2003లో జరిగాయి. సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం పుష్కరాలను అధికారికంగా నిర్వహించినా, పుష్కర పనులకు ఆలస్యంగా నిధులు విడుదల చేయటం, ప్రణాళికా బద్ధంగా వ్యవహరించక పోవటంతో పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. చివరి మూడు నెలల్లో అభివృద్ధి పనులు చేపట్టడంతో పుష్కరాల సమయానికి పూర్తికాకపోవటం ఇబ్బందులను తెచ్చిపెట్టింది.. చివరి నిమిషంలో హడావిడిగా నిర్ణయాలు తీసుకోవటంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత ఉత్సవాల సమయంలో రవాణా, తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కింగ్ విషయాల్లో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. అవసరమైన రహదారుల నిర్మాణం చేపట్టకపోవటం, వర్షాకాలం కావటంతో గంటల తరబడి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నిజామాబాద్-బాసర, జగిత్యాల-ధర్మపురి, రెంజల్-కందకుర్తి మార్గాల్లో గంటల తరబడి వాహనాలు నిలిచి పోయి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. పుష్కర క్షేత్రాల్లో మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తాయి. వివిధ మార్గాల ద్వారా వచ్చే వాహన దారులకు సరైన పార్కింగ్ వసతులు లేక కష్టాలు ఎదుర్కొన్నారు. స్నానఘట్టాల వద్ద భక్తుల నియంత్రణ లేక తోపులాటలు జరిగాయి. వసతి సౌకర్యాలు లేక వానలో భక్తులు నరకయాతన అనుభవించారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాంటి అపశ్రుతులకు చోటులేకుండా, భక్తులకు సమస్యలు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ప్రణాళికతో వ్యవహరించాలి. ప్రస్తుతం అభివృద్ధి పనులు ప్రారంభదశలో ఉన్న నేపథ్యంలో పనులు త్వరితగతిన, నాణ్యంగా పనులు చేసేలా అధికారులు పర్యవేక్షించాలి.
