కొత్తగూడెం, మార్చి 26: నాలుగు జిల్లాలలో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు అవసరమైన చర్యలను చేపట్టడంతో పాటు ...
కొత్తగూడెం, మార్చి 26: నాలుగు జిల్లాలలో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు అవసరమైన చర్యలను చేపట్టడంతో పాటు ఉద్యోగ నియామకాల్లో తీసుకోవాల్సిన నిబంధనలపై హైద్రాబాద్‌లోని సింగరేణి భవన్లో గురువారం జరిగిన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఉత్పత్తి, ఉత్పాదకతలపై సమీక్ష నిర్వహించారు. 100టన్నుల సా మర్ధ్యం కలిగిన 39డంపర్లతో పాటు భూగర్భగనులలో బొగ్గు ఉత్పత్తికి ఆరు ఎల్హెచ్డిలు, 48సైడ్ డంపర్లు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా కైరీగూడ ఓపెన్కాస్టుగనిలో 2.5మిలియన్ టన్నుల సంవత్సర ఉత్పత్తి లక్ష్యాన్ని పెంచి 3.5మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయాలని నిర్ణయించి దీనికి అవసరమైన చర్యల కోసం 133కోట్ల రూపాయలను కేటాయించాలని నిర్ణయించారు. అదేవిధంగా పివికె గనిలో కంటిన్యూయస్మైనర్ను రూ 114కోట్లతో ఏర్పాటు చేసి 3.75లక్షల టన్నుల ఉత్పత్తి నుండి 8.5లక్షల టన్నులకు ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణిగని విస్తరించి ఉన్న ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలనులోకల్గా, మిగిలిన ఆరు జిల్లాలను
నాన్‌లోకల్‌గా పరిగణించాలని, అంతేకాకుండా ఉద్యోగ నియామకాల్లో 20శాతం ప్రతిభ ఆధారంగా ఓపెన్క్యాటగిరి, మిగిలిన 80శాతం రిజర్వేషన్ల నిబంధనలకు అనుగుణంగా వర్తింపచేయాలని నిర్ణయం జరిగింది. ఈసమావేశంలో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్, ఎంఓసి అడిషనల్ సెక్రటరీ ఎకె భల్లా, ఎనర్జీ సెక్రటరీ అరవింద్‌కుమార్, ఎంఓసి ప్రాజెక్టు అడ్వైజర్ డిఎన్ ప్రసాద్. సింగరేణి డైరెక్టర్లు రమేష్‌కుమార్, మనోహర్‌రావు, రమేష్‌బాబులు పాల్గొన్నారు.