-ఎమ్మెల్యే కోనేరు కోనప్ప -దాతల సాయంతో ఫీజుల చెల్లింపు కాగజ్‌నగర్ : సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల పిల్లలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే కోనేరు ...
-ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
-దాతల సాయంతో ఫీజుల చెల్లింపు
కాగజ్‌నగర్ : సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల పిల్లలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శుక్రవారం పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాల లో ఏర్పాటు చేసిన సమావేశంలో దాతల నుంచి సేకరించిన నగదును పలు పాఠశాలల యాజమాన్యాలకు ఫీజులను అంద జేశారు. పట్టణంలోని 15 ప్రైవేట్ పాఠశాలల్లో కార్మికుల పిల్లలు విద్యనభ్యసిస్తుండగా, 20 లక్షల రూపాయలను చెల్లించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. డిప్యూటీ సీఎం కడి యం శ్రీహరి చేతుల మీదుగా రూ .14 లక్షలు చెల్లించగా, శుక్రవారం 6.50 లక్షల రూపాయలను అందజేసిట్లు ఆయన తెలిపారు. కార్మికుల పిల్లల ఫీజులు చెల్లించేందుకు దాతలు ఎంతగానో సహకరించారని, కార్మికుల పిల్లల చదువు కోసం ప్రతీ ఒక్కరూ సహకరించాల్సినవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
కార్మికుల ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పాఠశాలల యాజమాన్యాలు ఒత్తిడి తీసుకరాకపోవడం, పిల్లల చదువు కోసం దాతలు సహకరించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ తమ చదువులపై సహకరించిన ఎమ్మెల్యే కోనప్పతో పాటు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షురాలు సీపీ విద్యావతి, కౌన్సిలర్ విద్యావతి, రోటరీ క్లబ్ అధ్యక్షుడు దామోదర్‌రావు, నియాజొద్దీన్, ఎంఈఓ బిక్షపతి, నాయకుడు చిలువేరు సత్యనారాయణ, రాజ్‌కుమార్, జాకీర్ షరీఫ్, సత్యనారాయణ, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.