file photo ఇంద్రవెల్లి, మార్చి 25: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెండరీ పాఠశాలలో జరుగుతున్న ఎసెస్సీ వార్షిక పరీక్షల్లో బుధవారం మాస్ క...
![]() |
| file photo |
ఇంద్రవెల్లి, మార్చి 25: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెండరీ పాఠశాలలో జరుగుతున్న ఎసెస్సీ వార్షిక పరీక్షల్లో బుధవారం మాస్ కాపీయింగ్ పాల్పడుతున్న జడ్పీఎస్ఎస్ ఇంద్రవెల్లి పాఠశాల విద్యార్థి మోహన్ సింగ్ డిబార్ అయినట్లు పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ కరణ్ సింగ్ తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో ఫ్లయింగ్ స్క్వార్డ్‌గా విధులు నిర్వర్తిస్తున్న డిడివో రామరావు పరీక్ష కేంద్రంలో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థి మోహన్ సింగ్‌ను డిబార్ చేసినట్లు తెలిపారు. ఇంద్రవెల్లి బాలికల ఆశ్రమ పాఠశాలతో పాటు, కెస్లాపూర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న ఎసెస్సీ పరీక్షలను డివో రామరావు తనిఖీ చేశారు.
