(29 Mar) గోల్కొండ(హైదరాబాద్): గత మూడు రోజులుగా తారామతి-బారాదరిలో ప్రేక్షకులను సంగీత సాగరంలో ఓలలాడించిన పండిత్ భీమ్సేన్ జోషి జాతీయ సం...
(29 Mar) గోల్కొండ(హైదరాబాద్): గత మూడు రోజులుగా తారామతి-బారాదరిలో ప్రేక్షకులను సంగీత సాగరంలో ఓలలాడించిన పండిత్ భీమ్సేన్ జోషి జాతీయ సంగీత, నృత్య విభావరి ఆదివారంతో ముగిసింది. చివరి రోజు తబలా, పక్వజ్ వాయిద్య కళాకారుడు అభిజిత్ బెనర్జీ వాయిద్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అభిజిత్ వాయిద్యానికి తోడు ఘటం, సోమ్నాథ్ వాయించిన ఎక్తరా వాయిద్యం, అభిషేక్ వాయించిన ఎలక్ట్రిక్ సితార్, గోకుల్దాస్ దక్, గోపాల్ బుర్మన్ శ్రీకోల్, ప్రవీణ్ మృదంగం, రాజశేఖర్ మోర్సింగ్ వాయిద్యాలు వీక్షకుల వీనుల విందుగా సాగాయి. ఒకరికొకరు పోటీపడుతూ తమ వాయిద్యంతో నేనంటే నేను అన్న విధంగా రాగాల జల్లుతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అంతకుముందు ఒడిస్సీ నృత్య కళాకారులు రతికాంత్ మోహపాత్ర బృందం చేసిన నృత్యం లయబద్ధంగా సాగింది. మోహపాత్ర అభినయం ప్రేక్షకుల మనసు దోచుకుంది.
