హైదరాబాద్ : తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ లో వరంగల్ కు వరాలు ప్రకటించారు. హైదరాబాద్ - వరంగల్‌ను పారిశ్రామిక కారిడార్‌గా ...
హైదరాబాద్ : తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ లో వరంగల్ కు వరాలు ప్రకటించారు. హైదరాబాద్ - వరంగల్‌ను పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించిన ఆయన దాంతో పాటు వరంగల్‌లో టెక్స్టైల్స్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఫార్మాసిటీకి అనుబంధంగా మినీ ఇండస్ట్రియల్ టౌన్షిప్ అభివృద్ధి చేస్తామని అన్నారు. అలాగే వరంగల్‌కు వెళ్లే రహదారిలో ఉన్న యాదగిరి గుట్టకు భారీగా నిధులిచ్చారు. ఇక్కడ టెంపుల్ డెవలప్మెంట్ ఆథారిటీ ఏర్పాటు చేస్తున్నామని, గతానికి అదనంగా మరో వంద కోట్లు ఇస్తున్నామన్నారు.