(27 Mar) కావాలనే విమాన ప్రమాదం చేశాడు!కాక్‌పిట్‌లోకి పైలట్‌ను రానీయకుండా గడియఆల్ప్స్ పర్వతాల్లో కూలిపోయిన 'జర్మన్వింగ్స్'ప్రమ...
(27 Mar) కావాలనే విమాన ప్రమాదం చేశాడు!కాక్‌పిట్‌లోకి పైలట్‌ను రానీయకుండా గడియఆల్ప్స్ పర్వతాల్లో కూలిపోయిన 'జర్మన్వింగ్స్'ప్రమాదంపై ఫ్రాన్స్ అధికారుల వెల్లడిపారిస్: ఇటీవల ఆల్ప్స్ పర్వతాల్లో కూలిపోయిన జర్మన్వింగ్స్ విమానం కో-పైలట్ కావాలనే దాన్ని కిందికి దించి ప్రమాదానికి గురిచేసినట్టు కనిపిస్తోందని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. కాక్‌పిట్ నుంచి పైలట్ బయటకు వెళ్లిన తర్వాత కో-పైలట్ అండ్రియాజ్ ల్యూబిట్జ్(28) పూర్తిగా విమాన బాధ్యతలు తీసుకున్నాడని ఫ్రెంచి ప్రాసిక్యూటర్ బ్రైస్ రాబిన్ వెల్లడించారు. పైలట్‌ను లోనికి రానీయకుండా అతడు లోపలి నుంచి గడియ వేసుకున్నాడని, పైలట్ తలుపు తడుతున్నా తెరవటానికి నిరాకరించాడని విలేఖర్ల సమావేశంలో వివరించారు. విమానం కిందికి దిగుతున్నప్పటికీ అతడు మౌనంగానే ఉన్నాడని, ప్రమాదం జరిగిన సమయంలో అతడు సజీవంగా ఉన్నాడన్నారు. విమానం బ్లాక్‌బాక్స్ నుంచి లభించిన వాయిస్ రికార్డర్లోని మాటల ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు. అయితే ల్యూబిట్జ్ ఉగ్రవాది కాదని, ఈ ప్రమాదం ఉగ్రవాద ఘటన అనటానికి ఎలాంటి రుజువులు లభించలేదని తెలిపారు. ప్రమాదం జరగటానికి కొద్ది క్షణాల ముందు ప్రయాణికులు కేకలు వేసినట్టు రికార్డర్లో నమోదయ్యాయని వివరించారు. పైలట్లలో ఒకరు కాక్‌పిట్ నుంచి బయటకు వెళ్లారని, ప్రమాదానికి ముందు అతడు తిరిగి లోపలికి రాలేకపోయినట్టు రికార్డర్లోని మాటలను బట్టి తెలుస్తోందంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం పేర్కొన్న తర్వాత అధికారులు ఈ ప్రకటన చేశారు. సిబ్బందిలో ఒకరు కాక్‌పిట్‌లో లేని సమయంలో విమానం 38వేల అడుగుల ఎత్తు నుంచి కిందికి ఎందుకు దిగిందనే దాన్ని తెలుసుకోవటానికి దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇలా కిందికి దిగిన 10 నిమిషాల తర్వాత విమానం ఆల్ప్స్ పర్వతాల్లో కూలిపోవటం గమనార్హం. బార్సిలోనా నుంచి డ్యూజెల్డార్ఫ్కు బయలుదేరిన జర్మన్‌వింగ్స్‌కు చెందిన ఎయిర్‌బస్-320 విమానం మంగళవారం ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్ పర్వతాల్లో కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 144 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది అంతా మరణించారు.స్నేహ పూర్వక సంభాషణ: విమాన ప్రయాణం ఆరంభమైనప్పుడు పైలట్లు స్నేహ పూర్వకంగా, మృదువుగా మాట్లాడుకున్నట్టు రికార్డర్లో నమోదైంది. పైలట్లలో ఒకరు కాక్‌పిట్‌లోంచి బయటకు వెళ్లటానికి గల కారణమేంటో ఇప్పటికీ తెలియటం లేదని ఒక అధికారి తెలిపారు. కానీ ప్రమాదం జరిగినప్పుడు కాక్‌పిట్‌లో కో-పైలట్ ఒక్కడే ఉన్నాడని, తలుపును తెరవలేదన్నది మాత్రం నిజమేనని వివరించారు.
