(24 Mar) కొత్తగూడెం, మార్చి 23: సింగరేణి సంస్థ అత్యున్నత లక్ష్యాలను నిర్దేశించుకొని కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగుతున్...
(24 Mar) కొత్తగూడెం, మార్చి 23: సింగరేణి సంస్థ అత్యున్నత లక్ష్యాలను నిర్దేశించుకొని కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగుతున్న తరుణంలో డైరెక్టర్ (పా)గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న డైరెక్టర్ (ఫైనాన్స్) ఎస్ వివేకానంద్ రాజీనామా చేయడంతో సంస్థలోని ఇద్దరు డైరెక్టర్లకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ సోమవారం సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ ఉత్తర్వులు జారీ చేశారు. డైరెక్టర్ (ఆపరేషన్స్)గా పనిచేస్తున్న బి రమేష్‌కుమార్‌కు, డైరెక్టర్ (పా)గా, డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్టుగా) విధులు నిర్వహిస్తున్న ఎ మనోహర్‌రావుకు డైరెక్టర్ (ఫైనాన్స్)గా అదనపు పూర్తి బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరితో పాటు డైరెక్టర్ ఇఅండ్ఎంగా ఇప్పటికే రమేష్‌బాబు విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నతస్థాయి సమావేశాలు, సంస్థ తీసుకునే కీలకనిర్ణయాలలో సింగరేణి సంస్థలో సిఎండితో పాటు ఐదుగురు డైరెక్టర్లు కీలకపాత్ర పోషిస్తారు. సంస్థ కోసమే కాకుండా రాష్ట్భ్రావృద్ధిలో కూడా ప్రతి కార్మికుడు భాగస్వామ్యం కావాలనే నినాదంతో ఉత్పత్తి లక్ష్యాలను కూడా ఘననీయంగా పెంచుకున్న సంస్థలో ప్రస్తుతం ప్రధాన భూమికను సింగరేణి డైరెక్టర్లు పోషించాల్సివస్తుంది. అయితే ఐదుగురు డైరెక్టర్లు ఉండాల్సిన పరిస్థితుల్లో ముగ్గురు డైరెక్టర్లు మాత్రమే ఉండడం, వీరిలో ఇద్దరు డైరెక్టర్లకు మరో ఇద్దరు డైరెక్టర్లకు సంబంధించిన బాధ్యతలను అప్పగించడం వలన పనిభారం పెరుగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. రాజీనామా చేసిన డైరెక్టర్ ఎస్ వివేకానంద్ తిరిగి తన మాతృసంస్థ అయిన రైల్వేస్‌కు వెళ్ళినట్లు సమాచారం.