ఆ అధికారి జిల్లాకు రావడమే అరుదు. వస్తే మాత్రం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు లభించని సౌకర్యాలు, వసతులు ఆయనకు ఉండాలి. అలాగని ఇదంతా ...
ఆ అధికారి జిల్లాకు రావడమే అరుదు. వస్తే మాత్రం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు లభించని సౌకర్యాలు, వసతులు ఆయనకు ఉండాలి. అలాగని ఇదంతా ప్రభుత్వ యంత్రాంగం తరఫున జరుగుతుందనుకుంటే పొరపాటు. జిల్లాలోకి ప్రవేశం మొదలు జిల్లాను తిరిగి విడిచివెళ్లే దాకా నయా పైసా ఖర్చు కాకుండా అంతా ఔషధ దుకాణుదారులే దగ్గరుండి చూసుకుంటారు. ఇంతటి రాజవైభోగం అనుభవింది ఎవరంటే.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో శుక్రవారం అవినీతి నిరోధకశాఖకు చిక్కిన జిల్లా ఔషధ నియంత్రణ పరిపాలన సహాయ సంచాలకుడు మయూరి విజయ్‌గోపాల్. ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉన్నారన్న ఆరోపణలతో సదరు అధికారి అనిశాకు పట్టుబడటం జిల్లాలో కలకలం రేపింది. అటు రాజధానిలోని ఆయన స్వగృహంతో పాటు ఆయన విధులు నిర్వహించే కార్యాలయంలో.. గతంలో ఆదిలాబాద్‌లో నివాసమున్న ఇంటిని ఏకకాలంలో సోదాలు చేశారు. కళ్లు బైర్లు కమ్మే ఆస్తులు బయటపడటం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది.చీ/్డ్న్థ్మజి చ్డ్న్థ్మీ ్బై్శ్ఠ=ఖి+2ఖిజిజిల్లాకేంద్రంలోని టీచర్స్‌కాలనీలోని జిల్లా ఔషధ నియంత్రణ పరిపాలన సహాయసంచాక కార్యాలయానికి ఉదయం 7 గంటలకే జిల్లా అనిశా అధికారుల బృందం హుటాహుటీన చేరుకుంది. కార్యాలయం తలుపులు తెరిపించి ఒక్కొక్కటిగా అందులోని కీలక దస్త్రాలను పరిశీలించారు. గంటసేపు దస్త్రాలను పరిశీలించిన అధికారులు ఫిల్టర్‌బెడ్ ఏరియాలోని అధికారి విజయ్‌గోపాల్ నివాసమున్న అద్దె ఇంటికి వెళ్లారు. ఎనిమిది నెలల కిందటే ఆ ఇంటిని ఖాళీ చేశారని అక్కడివారు చెప్పడంతో వెనుదిగిరిన అధికారులు మళ్లీ కార్యాలయానికి తరలివెళ్లారు. అక్కడ కొద్దిసేపు దస్త్రాలను పరిశీలించిన అధికారులు తమ వెంట వాటిని తీసుకెళ్లారు. పట్టణ శివారులోని టీచర్స్‌కాలనీలో ఔషధనియంత్రణ కార్యాలయం ఉండటంతో ఉదయమే అనిశా బృందం అక్కడికి వెళ్లడం స్థానికుల్లో ఉత్కంఠకు దారితీసింది. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలసుకునేందుకు వారంతా ఆసక్తిని కనబర్చారు. మీడియా బృందం అక్కడ గుమిగూడి ఉండటంతో వారిని వివరాలను అడిగి తెలుసుకునే యత్నంచేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో సదరు అధికారి అనిశాకు పట్టుబడటం టీవీల్లో ప్రసారం కావడంతో అంతా అవాక్కయ్యారు. అక్కడ అనిశాకు చిక్కింది జిల్లా అధికారేనని తెలిసి నిశ్చేష్ఠులయ్యారు. జిల్లా కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన తమకు విలువైన పత్రాలు లభించాయని, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు అనిశా సీఐ వేణుగోపాల్ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. జిల్లాలో ఆస్తులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. ఈ దాడుల్లో మరో సీఐ కాశయ్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
