MCC Mancherial మంచిర్యాలరూరల్, మార్చి 25: మంచిర్యాల సిమెంట్ కంపెనీకి చెందిన ఆస్తులను బుధవారం మున్సిపల్ సిబ్బంది జప్తు చేశారు. కీలక సమా...
![]() |
| MCC Mancherial |
మంచిర్యాలరూరల్, మార్చి 25: మంచిర్యాల సిమెంట్ కంపెనీకి చెందిన ఆస్తులను బుధవారం మున్సిపల్ సిబ్బంది జప్తు చేశారు. కీలక సమాచారం ఉన్న కంపెనీకి చెందిన నాలుగు కంప్యూటర్లు, మూడు ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ వెంకన్న తెలిపారు. కంపెనీ మున్సిపాలిటికి ఆస్తి పన్న రూపంలో రూ.3300335 చెల్లించాల్సి ఉండగా, వడ్డీ తీసేసి 28లక్షల 24వేల 150రూపాయలు చెల్లించాలని కమిషనర్ పేర్కొన్నారు. ఆస్తి పన్నులు చెల్లించాలని నోటీసులు ఇచ్చిన స్పందన లేకపోవడం కంపెనీ ఆస్తులు జప్తు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆస్తులను జప్తు చేసే సమయంలో అక్కడ ఉన్న అధికారులు, మున్సిపల్ అధికారుల మధ్య వాగ్వివాదం జరిగిందన్నారు. సిమెంట్ కంపెనీకి చెందిన అధికారులు ఏ జీ ఓ ప్రకారం కంప్యూటర్లు జప్తు చేస్తున్నారని కమిషనర్‌ను ప్రశ్నించారు. దీంతో కమిషన్ మంచిర్యాల సిఐ సురేష్‌కు సమాచారం అందించారు. ఎస్సై రాజేశం సిమెంట్ కంపెనీకి చేరుకుని అధికారులను సముదాయించే ప్రయత్నం చేశారు. కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల 31లోపు ప్రతి ఒక్కరు ఆస్తి పన్ను చెల్లించాలని లేదంటే వారి ఆస్తులను జప్తు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ వెంకటేశ్వర్, శానిటరి ఇన్స్పెక్టర్ మహేశ్వర్‌రెడ్డి, టిపిఓ జలీల్, టిపిఎస్ భాస్కర్ ఉన్నారు.
