MLC elections in Telangana (26 Mar) హైదరాబాద్, మార్చి 25: మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతో ఏర్పాటైన శాసన మండలి పట్ట్భద్రుల...
![]() |
| MLC elections in Telangana |
(26 Mar) హైదరాబాద్, మార్చి 25: మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతో ఏర్పాటైన శాసన మండలి పట్ట్భద్రుల స్థానం ఓట్ల లెక్కింపుపై మహానగరంలో క్షణ క్షణం ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలైన బిజెపి, తెరాస అభ్యర్థుల జయాపజయాలపై నగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా బెట్టింగ్‌లు జరిగాయి. ఓల్డ్ మలక్‌పేట, ఖైరతాబాద్, బేగంబజార్, గోషామహల్, హిమాయత్‌నగర్, అంబర్‌పేట, ఆబిడ్స్, కార్వాన్ తదితర ప్రాంతాల్లో బిజెపి, తెరాస అభ్యర్థులపై లక్షల రూపాయల బెట్టింగ్‌లు జరిగాయి. ఓల్డ్ మలక్‌పేటలో కొందరు స్థానిక నేతలు ఏకంగా ఓ గదిని అద్దెకు తీసుకుని ఆన్లైన్లో కౌంటింగ్ ఫలితాలను వీక్షిస్తున్నామని చెప్పుకంటూ, లక్షలాది రూపాయల బెట్టింగ్‌లను స్వీకరించినట్లు సమాచారం. బెట్టింగ్ కేంద్రంలో అధికారం చేపట్టిన బిజెపికి ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల్లో చుక్కెదురైనట్టు ప్రత్యేక రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా అధికారం చేపట్టిన తెరాసకు పట్ట్భధ్రుల స్థానం ఎన్నికలో పరాభవం ఎదురైంది. ఎవరూ ఊహించని తరహాలో బిజెపి అభ్యర్థి రాంచందర్‌రావు మొదటి రౌండ్ నుంచే తెరాస అభ్యర్థి దేవీప్రసాద్‌పై ఆధిక్యతను చాటుకున్నారు. కానీ సార్వత్రిక ఎన్నికల్లో మాదిరి కాకుండా పట్ట్భధ్రుల ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రాధాన్యత క్రమంలో కొనసాగుతుంది. ఎపుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటా ఊహించలేని తరహాలో కౌంటింగ్ కొనసాగుతూ, ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. చాదర్‌ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్స్‌లో ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైనా, తొలి ప్రక్రియగా మొత్తం పోలైన లక్షా 11వేల 700 ఓట్లను 50 ఓట్లు చొప్పున బండిల్స్ కట్టుకునే ప్రక్రియ దాదాపు మధ్యాహ్నం వరకు కొనసాగింది. ఆద్యంతం..ఆసక్తికరం! మొదటి నుంచి ప్రధాన ప్రత్యర్థులుగా భావిస్తున్న తెరాస అభ్యర్థి దేవీప్రసాద్, బిజెపి అభ్యర్థి రాంచందర్‌రావు, కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన రవికుమార్ గుప్తాలతో పాటు మరో 28 అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో పోలైన ఓట్లను నాలుగు రౌండ్లుగా లెక్కింపు చేపట్టారు. మొదటి రౌండ్లో రాంచందర్‌రావుకు 13205 ఓట్లు దక్కగా, దేవీప్రసాద్‌కు 10114 ఓట్లు, రవికుమార్ గుప్తాకు 749 ఓట్లు దక్కాయి. అదే రెండో రౌండ్లో రాంచందర్‌రావుకు 13474 ఓట్లు రాగా, దేవీప్రసాద్‌కు 10136 ఓట్లు వచ్చాయి. రవికుమార్గుప్తాకు 790 ఓట్లు వచ్చాయి. రెండు రౌండ్లు ముగిసే సరికి రామచందర్‌రావుకు 26వేల 679 ఓట్లు, దేవీప్రసాద్‌కు 20వేల 430 ఓట్లు దక్కాయి. మూడో రౌండ్ ముగిసే సమయానికి రాంచందర్‌రావుకు 40వేల 319 ఓట్లు, దేవీప్రసాద్‌కు 30వేల 524 ఓట్లు వచ్చినట్లు జిహెచ్ఎంసి అధికారులు వెల్లడించారు. మొత్తం పోలైన లక్షా 11వేల 700 ఓట్లను 28 టేబుళ్లతో, ఒక్కో టేబుళ్లకు వెయ్యి ఓట్లు చొప్పున లెక్కింపు చేపట్టారు. రౌండ్‌కు 28వేల ఓట్ల లెక్కింపుతో కొనసాగిన కౌంటింగ్ ప్రక్రియలో రాత్రి తొమ్మిదిన్నర సమయంలో ప్రారంభమైన నాలుగో రౌండ్ చివర్లో రాంచందర్‌రావు 12వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినట్లు అధికారులు నిర్థారించారు. మండలిలో ప్రజావ్యతిరేక విధానాలను అడ్డుకుంటా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినందుకే పట్ట్భద్రుల బిజెపికి పట్టం కట్టారని ఎన్నికల్లో గెలుపొందిన ఆ పార్టీ అభ్యర్థి రాంచందర్‌రావు అన్నారు. ఎన్నికల్లో తెరాస పార్టీ ఎంతో అధికార దుర్వినియోగానికి పాల్పడినా, పట్ట్భద్రులు ఎంతో వ్యూహాత్మకమైన నిర్ణయానిచ్చి తనను గెలిపించారన్నారు. కౌంటింగ్ సెంటర్ బయట ఆయన ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ పట్ట్భద్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజాసమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా తెలంగాణ శాసన మండలిలో ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతానని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బిజెపి శ్రేణులు పెద్దయెత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు పంచిపెట్టుకున్నారు. రంగులు పూసుకుని ఆనందంతో నృత్యాలు చేశారు. ఇదే ఫలితం రానున్న బల్దియా ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.
