నార్నూర్ : మండలంలోని మాన్కపూర్ చెరువు కింద నిర్మాణం చేపడుతున్న ఎడమ కాలువ కింద ముంపుకు గురైన బాధిత రైతులను ఆదుకుంటామని ఉట్నూరు ఆర్డీవో ఐల...
నార్నూర్ : మండలంలోని మాన్కపూర్ చెరువు కింద నిర్మాణం చేపడుతున్న ఎడమ కాలువ కింద ముంపుకు గురైన బాధిత రైతులను ఆదుకుంటామని ఉట్నూరు ఆర్డీవో ఐలయ్య అన్నారు. బుధవారం మండలంలోని మాన్కపూర్ గ్రామంలో నార్నూర్, భీంపూర్, మాన్కపూర్ గ్రామపంచాయతీలకు చెందిన రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా ఎడమ కాలువ కింద ముంపుకు గురైనా రైతులకు ఎకరానికి రూ.3 లక్షలు నష్టపరిహారం కింద అందజేయాలని తీర్మానం చేసి, ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆర్డీవో ఐలయ్య మాట్లాడుతూ కొత్త చట్టం ప్రకారం రైతులకు రావాల్సిన నష్టపరిహారాన్ని 60 రోజుల్లో అందే విధంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, తగిన నష్టపరిహారం అందే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. మాన్కపూర్లో14ఎకరాల 29 గుంటలు, నార్నూర్‌లో11 ఎకరాల 4 గుంటలు, భీంపూర్‌లో3ఎకరాల 4 గుంటలు ఈ ఎడమ కాలువ కింద ముంపుకు గురవుతున్నట్లు తెలిపారు. కాలువ నిర్మాణ పనులను రైతులు అడ్డుకోవద్దని, రైతులకు నష్టపరిహారం అందజేస్తామని అన్నారు. ఆర్డీవో వెంట ఎంఐఇఇ జాదవ్ గుణవంత్‌రావు, ఎంఐడిఈ రాథోడ్ విఠ్ఠల్, ఎంఐఏఈ రాథోడ్ వినోద్, మండల సర్వేయల్ జాదవ్ సోన్సింగ్, ఆర్ఐలు శాంసుందర్,ప్రహ్లాద్, స్థానిక సర్పంచ్ తొడసం నాగోరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
