-తాండూర్‌లో మూడు గంటలపాటు హల్చల్ -గొడ్డలి, బీరు సీసాతో వీరంగం -పోలీస్‌స్టేషన్ ఎదుట కారు ధ్వంసం -ముగ్గురిపై దాడి, ఆసుపత్రికి తరలింపు -పట...
-తాండూర్‌లో మూడు గంటలపాటు హల్చల్ -గొడ్డలి, బీరు సీసాతో వీరంగం
-పోలీస్‌స్టేషన్ ఎదుట కారు ధ్వంసం
-ముగ్గురిపై దాడి, ఆసుపత్రికి తరలింపు
-పట్టుకుని చితకబాదిన గ్రామస్తులు
తాండూరు : తాండూర్‌లో ఓ ఉన్మాది రెచ్చిపోయా డు. మూడు గంటలపాటు వీరంగం సృష్టించి, చి వరకు గ్రామస్తుల చేతిలో చావుదెబ్బలు తిన్నాడు.. వివరాల ప్రకారం.. తంగళ్లపల్లికి చెందిన మాడిశె ట్టి శ్రీనివాస్ ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో బీరు సీసా పట్టుకుని మొదట తాండూర్ పోలీస్‌స్టేషన్ సమీపానికి వచ్చాడు. అక్కడ ఓ కేసు విషయమై వేచి ఉన్న ర్యాలీగఢ్పూర్కు చెందిన డొరిశెట్టి రవి కారును ధ్వంసం చేశాడు. తన కారు ఎందుకు ధ్వంసం చేస్తున్నావని అడిగితే రవి చేతిపై గొడ్డలితో గాయపరిచాడు. అదే సమయంలో శ్రీనివాస్‌ను పట్టుకునే ప్రయత్నం చేయగా, కిష్టంపేటకు చెందిన మేడి శ్రీనివాస్ నడుంపై గొడ్డలితో బా దాడు.
వెంటనే రవి, శ్రీనివాస్‌ను స్థానికులు 108 లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు హెచ్చరించినా శ్రీనివాస్ వినకుండ, వార్డుల్లోకి వెళ్లాడు. ఇలా మూడు గంటలపాటు వాడవాడలా తిరిగి హడలెత్తించాడు. చివరకు స్థా నికులంతా ఏకమై బస్టాండ్ సమీపంలో మూకుమ్మడిగా దాడి చేసి పట్టుకుని చితకబాదారు. ఇదే తరుణంలో కానిస్టేబుల్ నాగరాజు తలపై శ్రీనివా స్ గొడ్డలితో దాడి చేయగా, వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఉన్మాదిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత ఉన్మాది మాడిశెట్టి శ్రీనివాస్‌ను చికిత్స కోసం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తాండూర్ ఎస్ఐ రమణారావు మాట్లాడా రు. మాడిశెట్టి శ్రీనివాస్‌కు పళ్లై 18 ఏళ్లు గడిచినా, పిల్లలు కాలేదు. ప్రస్తుతం తన భార్య మూ డు నెలల గర్భవతి కాగా, అనుమానం పెంచుకున్నాడు. ఓ అనుమానిత వ్యక్తి పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉన్నాడని అనుమానిస్తూ కొద్ది రోజులుగా సైకోల ప్రవరిస్తూ, ఠాణా సమీపంలో సంచరిస్తున్నాడు. గతంలో శ్రీనివాస్ దంపతులకు ఎస్ఐ అజయ్‌బాబు కౌన్సెలింగ్ ఇచ్చినా, అతని తీరు మారలేదు అని తెలిపారు.