file photo (30 Mar) * బస్సును ఢీకొన్న లారీ * ఐదుగురికి గాయాలు హుజూరాబాద్ , మార్చి 29: హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి వద్ద వరంగల్ - కరీంన...
![]() |
| file photo |
(30 Mar) * బస్సును ఢీకొన్న లారీ * ఐదుగురికి గాయాలు హుజూరాబాద్ , మార్చి 29: హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి వద్ద వరంగల్ - కరీంనగర్ రహదారిపై ఆదివారం సాయంత్రం ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం వేములవాడ నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ వెనుకవైపు ఢీకొంది. దీంతో బస్సులో వెనుక సీట్ల వైపు కూర్చున్న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామానికి చెందిన బూక్య వీరమ్మ, మాలోతు రాజు, అసవత్ బద్రిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వేములవాడకు శ్రీరామ నవమిని పురస్కరించుకుని దైవ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఇందులో బూక్య వీరమ్మ కుడి చేయి మొత్తం తెగిపడింది. ఈ సంఘటన బాధితుల స్థితి హృదయవిదారకంగా ఉంది. వీరమ్మ స్థితి చూసి పలువురు చలించిపోయారు. ఈ ప్రమాదంలో మాలోతు రాజు కూడా తన కన్నును కోల్పోయాడు. వీరిని ప్రథమ చికిత్స నిమిత్తం 108లో హుజూరాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించి అనంతరం వరంగల్‌లోని ఎం జి ఎం కుతరలించారు. బస్సును ఢీకొని లారీ వెళ్లిపోవడంతో ఎస్సై రాజేందర్ దీన్ని చెంజెర్ల వద్ద వెంబడించి పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇఆర్‌సి నివేదికను చెత్తబుట్టలో వేయకుంటే ఉద్యమం * మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ధర్మపురి, మార్చి 29: పేద ప్రజలపై భారం మోపిన ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిటీ నివేదికను సర్కారు అమలు చేసి విద్యుత్ చార్జీలు పెంచితే రాజకీయాలకు అతీతంగా తెలంగాణలో పెద్దఎత్తున ఉద్యమం చేపట్టక తప్పద ని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఆదివారం ధర్మపురిలో విలేఖర్లతో ప్రభాకర్ మాట్లాడుతూ గుజరాత్ తరహాలో తెలంగాణ ధనిక రాష్ట్రంగా, మిగులు బడ్జెట్గల రాష్ట్రం గా ఉందనిచెపుతున్న కెసిఆర్, విద్యుత్ ఛార్జీలపెంపు నిర్ణయం ఎందు కు తీసుకుంటున్నారో స్పష్టం చేయాల న్నారు. శాసనసభలో జీతాల పెంపును ప్రకటించిన ప్రభుత్వం, విద్యుత్ ఛార్జీ ల పెంపునుకూడా చర్చకు తెస్తే బాగుండేదన్నారు. ఉద్యమ పార్టీ నేతగా, ధర్మపురిలో గత పుష్కరాల సమయంలో యాగంలో పాల్గొని, టిడిపి ప్రభుత్వాన్ని పుష్కర నిధులు కేటాయింపు విషయంలో విమర్శించి, గత ఎన్నికల సమయాన తమపార్టీ అధికారంలోకి వస్తే, ధర్మపురి పుష్కరాలకు 500కోట్లు కేటాయిస్తామని ప్రకటించి, ఇప్పుడు చేస్తున్నదాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కెసిఆర్ రెండు నాల్కల ధోరణి ని ఇకనైనావీడి, ధర్మపురికి అధిక నిధు లు కేటాయించి, సకాలంలో పనులు చేయించాలని డిమాండ్ చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షడు ఎల్లాగౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమయ్య, జైనా సహకార సంఘం చైర్మన్ నరేశ్, దేవస్థానం మాజీ చైర్మన్లు రాజేందర్, దినేశ్, ఎంపిటిసి రమేశ్, నాయకలు వినోదరావు, శ్రీనివాస్, షబ్బీర్, రవి, వేణు తదితరులు పాల్గొన్నారు. సత్ఫలితాలను అందించని సంక్షేమ పథకాలు * శాసనమండలి కాంగ్రెస్ పక్ష నేత డి శ్రీనివాస్ ధర్మపురి, మార్చి 29: రాష్ట్రంలో కెసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు సత్ఫలితాలను అందించడం లేదని ప్రభుత్వ మండలి కాంగ్రెస్ పక్ష నేత ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ధర్మపురీశుడిని దర్శించుకుని అనంతరం సీనియర్ కాంగ్రెస్ నేత కస్తూరి రాంకిషన్ గృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో డిఎస్ మాట్లాడుతూ తెరాస ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రధానాంశాలైన రుణమాఫీ, రేషన్‌కార్డులు, పెన్షన్లు, ఫీజు రీయిం బర్స్మెంట్, ఉచితవిద్య లాంటి కార్యక్రమాలు ఆశించినస్థాయిలో ప్రజల మన్నలను పొందలేకున్నాయన్నారు. పేదలపై భారం వెయమంటూనే, ఇఆర్‌సి ప్రదిపాదించిన ప్రకారం విద్యుత్ ఛార్జీలు పెంచే నిర్ణయం తీసుకున్నా రని, ఉభయ సభలు నడుస్తున్న సమయంలో బడ్జెట్ సమావేశాలలో విద్యు త్ ఛార్జీల విషయంపై, ఇఆర్‌సి నివేదికను చర్చించాల్సి ఉన్నదని, అయతే సమావేశాల తర్వాత విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన చేశారన్నారు. ప్రాణహిత-చేవెళ్ళకు తగిన నిధులు కేటాయించకపోవడం సమంజసం కాదన్నారు. ఇళ్ళ నిర్మాణాల విషయంలో చెల్లింపులను ఆపుతున్నారని, అవకతవకలుజరిగితే విచారణ జరిపి, చర్యలు తీసుకోవలెతప్ప కార్యక్రమానికి విఘా తం కల్గించతగదన్నారు. సీమాంధ్ర పాలనలో అన్యాయం జరిగిందని పదేపదే చెప్పే కెసిఆర్ ప్రస్తుతం తెలంగాణను తెలంగాణ నేతలే పాలిస్తున్నపుడు పుష్కరాల నిధులు కేటాయింపుపై ఏంసమాధానం చెపుతారని ప్రశ్నించారు. ఇరువురు మంత్రులు ఈటెల, కెటిఆర్, చీఫ్‌విప్ ఈశ్వర్ ధర్మపురి క్షేత్రానికి ప్రత్యేక పుష్కర నిధుల కేటాయింపునకు చొరవ చూపాలన్నారు. ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లాగౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమయ్య, జైనా పిఎసిఎస్ చైర్మన్ నరేశ్, దేవస్థానం మాజీ చైర్మన్లు దినేశ్, రాజేందర్, ఎంపిటిసిలు రమేశ్, మల్లేశం, నాయకులు రాంకిషన్, నర్సయ్య, అజ్మత్ అలీ, కిష్టయ్య, షబ్బీర్, అశోక్, రవి, వేణు, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
