-రాజంపేట అటవీప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు బలి -రంగంలోకి అటవీ అధికారులు -ముగ్గురి అరెస్ట్ -మాంసం స్వాధీనం కడెం : కడెం మండలంలో వేటగాళ్లు బరి...
-రాజంపేట అటవీప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు బలి
-రంగంలోకి అటవీ అధికారులు
-ముగ్గురి అరెస్ట్
-మాంసం స్వాధీనం
కడెం : కడెం మండలంలో వేటగాళ్లు బరితెగించారు. గురువారం రాత్రి రెండు నీలుగాయిలను హతమార్చారు. సమాచారమందుకున్న అటవీ అ ధికారులు, శుక్రవారం ఉదయం ముగ్గురిని అరెస్ట్ చేసి, మాంసం స్వాధీనం చేసకున్నారు. అటవీ క్షేత్రధికారి శంకర్ ఈ వివరాలు వెల్లడించారు. గంగాపూర్ పంచాయతీ పరిధిలోని రాజంపేటకు చెందిన గిర్నే ఎల్లయ్య, చేనేని ఎల్లయ్య, చేనేని భూమేష్ వన్యప్రాణుల కోసం సమీప అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న వారి పంట చేను పక్క న ఉచ్చు అమార్చారు. గురువారం రాత్రి అటుగా వచ్చిన ఏడాదిలోపు వయసున్న రెండు నీలుగాయిలు అందులో పడ్డాయి. దొరికిన నీలుగాయిలను చంపి, మాంసం అమ్మే ప్రయత్నం చేయగా, విషయం బయటకు వచ్చింది.
సమాచారం అం దుకున్న అటవీ అధికారులు శుక్రవారం సంఘటన స్థలానికి వెళ్లేందుకు యత్నించగా, వేటగాళ్లు కొందరు స్థానికుల సహాయంతో ఎదురుదాడికి ప్ర యత్నం చేశారు. దీంతో కడెం పోలీసులు, పెంబి అటవీ అధికారుల సహాయం తీసుకుని గ్రామానికి వెళ్లారు. ఇది గ్రహించిన నిందితులు అక్కడి నుం చి పారిపోయేందుకు యత్నించగా, చాకచక్యంగా పట్టుకున్నారు. 50 కిలోల దాకా మాంసం స్వాధీ నం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రి మాండ్కు తరలించారు. ఏఎస్ఓ నజీర్ఖాన్, ఎఫ్బీవో శ్రీనివాస్, తిరుపతి, కీర్తి, ైస్ట్రెకింగ్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.