కాళేశ్వరం.. జలాధారం!ఇలా ప్రయోజనం...

Kaleshwaram , Karimnagar Dist, Telangana కరీంనగర్‌..... వెలుగులు పంచే ఎన్టీపీసీ ద్వారా దేశమంతటికీ సుపరిచితమైన మన జిల్లా ఇప్పుడు రాష్ట్...

Kaleshwaram , Karimnagar Dist, Telangana
కరీంనగర్‌..... వెలుగులు పంచే ఎన్టీపీసీ ద్వారా దేశమంతటికీ సుపరిచితమైన మన జిల్లా ఇప్పుడు రాష్ట్రంలో ఖమ్మం, మహబూబ్‌నగర్‌ మినహా అన్ని జిల్లాలకు సాగు, తాగు నీరు అందించనున్న బృహత్తర ప్రాజెక్టుకు వేదికగా మారబోతోంది. 160 టీఎంసీల ఎత్తిపోతల లక్ష్యంగా ఆదిలాబాద్‌ జిల్లా తుమ్మెడిహెట్టి వద్ద నిర్మించతలపెట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణ స్థలం కాళేశ్వరానికి మారింది. ఈ ప్రాజెక్టుకు 'కాళేశ్వరం'గా నామకరణం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రాజెక్టు స్థలంపై అధ్యయనానికి ఇప్పటికే ఇంజినీర్ల బృందం రెండుసార్లు సర్వే నిర్వహించింది. ప్రాణహిత, గోదావరి నదులను కలుపుతూ మహదేవపూర్‌ మండలం మేడిగడ్డ వద్ద బ్యారేజి నిర్మిస్తే ముంపు ప్రాంతం తగ్గడంతో పాటు మేలు జరుగుతుందన్న నిపుణుల బృందం సూచనలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించేందుకు ఆదివారం ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు.కాళేశ్వర-ముక్తీశ్వరుని చెంత...గోదావరి-ప్రాణహిత-సరస్వతి (అంతర్వాహిని) నదుల కలయికతో త్రివేణి సంగమ స్థలంలోని కాళేశ్వర-ముక్తీశ్వర ఆలయ సమీపంలో ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుండడంతో మారుమూలన ఉన్న ఈ ప్రాంత ప్రాధాన్యం మరింత పెరగనుంది. వాస్తవానికి 160 టీఎంసీల నీటి మళ్లింపు లక్ష్యంతో 2008లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు ఆదిలాబాద్‌ జిల్లా తుమ్మెడిహెట్టి వద్ద శ్రీకారం చుట్టారు. కరీంనగర్‌తో పాటు వరంగల్‌, మెదక్‌, నిజామాబాద్‌, నల్గొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 16.47 లక్షల ఎకరాల ఆయకట్టుకు 123 టీఎంసీల సాగు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కరీంనగర్‌ జిల్లాలో 10 టీఎంసీలు, హైదరాబాద్‌కు 20 టీఎంసీల తాగునీరు అందించాలనీ నిర్ణయించారు. పరిశ్రమలకూ 16 టీఎంసీలు సరఫరా చేస్తారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణ స్థలం మారితే ఆదిలాబాద్‌ జిల్లాకు సాగునీటి సరఫరా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. మొత్తం పనులను 28 ప్యాకేజీలుగా విభజించి గుత్తేదారులకు పనులు అప్పగించారు. తొలుత ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అవసరమైన 23 అనుమతుల్లో 18 అనుమతులు వచ్చినా మహారాష్ట్రతో ఇబ్బందులు వచ్చిపడ్డాయి. తుమ్మెడిహెట్టి వద్ద బ్యారేజీ ఎత్తు 152 మీటర్లుగా నిర్ధరించడంతో మహారాష్ట్రలోనే ముంపు ప్రాంతం అత్యధికంగా ఉండే అవకాశం ఏర్పడింది. దీంతో ముంపు ప్రాంతాన్ని తగ్గించడం... ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీపంలో నిర్మాణం ద్వారా ఎత్తిపోతల వ్యయం తగ్గించుకోవాలని ప్రభుత్వం భావించింది. పొరుగు రాష్ట్రంతో సమస్యలు లేకుండా చూసుకోవడం ద్వారా జాతీయ హోదాకూ అడ్డంకులు తొలగిపోతాయన్న ఉద్దేశంతో కాళేశ్వరం దిగువన ప్రాజెక్టు నిర్మాణానికి నిర్ణయించింది.బాబ్లీ, విష్ణుపురి ఇతర మహారాష్ట్ర ప్రాజెక్టులతో తెలంగాణలోనే కీలకమైన శ్రీరాంసాగర్‌ జలాశయానికి నీటి లభ్యత తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఏడాది పొడవునా నీటి ప్రవాహం ఉండే ప్రాణహితపై ఆధారపడి ప్రాజెక్టు నిర్మించాలని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.. తుమ్మెడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే ఆదిలాబాద్‌ జిల్లాకు సాగు, తాగు నీరు దాని నుంచి కొంతమేర తీసుకునే వారు... ప్రస్తుతం కాళేశ్వరం దిగువన ప్రాజెక్టు నిర్మిస్తే ఆదిలాబాద్‌ జిల్లాకు ఆ ప్రయోజనం కలిగే అవకాశం లేనట్లే. అయితే జిల్లాలోని ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, గౌరవెళ్లి, గండిపల్లి, తోటపల్లి ప్రాజెక్టులకు కాళేశ్వరం ప్రాజెక్టు నీరు అందుతుంది. వీటి నుంచి ఇతర జిల్లాల్లోని ప్రాజెక్టులకు నీరు ఎత్తిపోస్తారు.. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టుల కింద జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం కలుగుతోంది. ఇందులో దాదాపు మూడు లక్షల ఎకరాలు ఆయకట్టు కొత్తదే. మిగతా లక్ష ఎస్సారెస్పీ పాత ఆయకట్టుకు పుష్కలంగా సాగు నీరు లభిస్తుంది. కీలకమైన వాటర్‌గ్రిడ్‌కు నీటి కొరత ఉండదు.విహంగ వీక్షణం.. దైవదర్శనం!కాళేశ్వరం దిగువన నిర్మించనున్న ప్రాజెక్టు స్థలాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం హెలీకాప్టర్‌ ద్వారా గగన వీక్షణం (ఏరియల్‌ సర్వే) చేయనున్నారు. వరంగల్‌ జిల్లాలోని దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టు స్థలాల పరిశీలన అనంతరం ఆయన జిల్లాలోకి ప్రవేశిస్తారు. ముఖ్యమంత్రి గగన వీక్షణానికే పరిమితమవుతారని అధికారికంగా ప్రకటించినా ఆయన కాళేశ్వరంలో ఆలయ దర్శనం చేసుకుంటారని సమాచారం. ఈ పర్యటనలో మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌.విద్యాసాగరరావు కూడా పాల్గొంటారని భావిస్తున్నారు. కానీ అధికార యంత్రాంగం ఈ అంశాన్ని నిర్ధరించలేదు. ముఖ్యమంత్రి ఉదయం 11 గంటల తర్వాత వరంగల్‌ నుంచి బయలుదేరుతారని... దేవాదుల లేదా కాళేశ్వరంలో మధ్యాహ్న భోజనం చేస్తారనే భావనతో రెండు జిల్లాల అధికారులు ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరం అనంతరం మధ్య మానేరు ప్రాజెక్టునూ ముఖ్యమంత్రి హెలికాప్టర్‌ నుంచి పరిశీలిస్తారు. అనంతరం హైదరాబాద్‌ వెళతారు. సీఎం రాక నేపథ్యంలో మంథని ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: కాళేశ్వరం.. జలాధారం!ఇలా ప్రయోజనం...
కాళేశ్వరం.. జలాధారం!ఇలా ప్రయోజనం...
http://1.bp.blogspot.com/-mJSd63UgUiw/VRiOqcdCQUI/AAAAAAAAEqk/sBUVzGSmV-g/s1600/banner4.jpg
http://1.bp.blogspot.com/-mJSd63UgUiw/VRiOqcdCQUI/AAAAAAAAEqk/sBUVzGSmV-g/s72-c/banner4.jpg
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/03/blog-post_540.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/03/blog-post_540.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy