(24 Mar) మానకొండూర్, మార్చి 23: రైతులు బిందుసేద్యంతో సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీం...
(24 Mar) మానకొండూర్, మార్చి 23: రైతులు బిందుసేద్యంతో సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని చెంజర్ల (పెద్దురుపల్లి)లో దాసరి భూమయ్య అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో క్యాప్సికం పంటను బిందు సేద్యంతో సాగుచేస్తున్న వివిధ రకాల కూరగాయల పంటలను చైర్మన్ రవీందర్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసిసిబి రైతుల పిల్లలు విదేశాలల్లో ఉన్నత చదువులకోసం రుణసౌకర్యం కల్పించి ఇప్పటివరకు 98 మంది విద్యార్థులను విదేశాలకు పంపడం జరిగిందన్నారు. దాసరి భూమయ్య వ్యవసాయ క్షేత్రంలో ఎకరం పాలిహౌస్, 9 ఎకరాలలో దానిమ్మ పంటను సాగు చేస్తున్నట్లు తెలిపారు. బిందు సేద్యం ద్వారా పంటను సాగు చేసే రైతులకు 50 శాతం రాయితీ కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో కోరుట్ల, బావుపేట, కాజీపూర్, పెద్దపల్లి, చెంజర్లలో పాలిహౌస్ల ద్వారా పంటను సాగు చేస్తున్నారు. చిన్నకాల్వలలో పుట్టగొడుగుల (ముసరం) పెంపకం డిసిసిబి ద్వారా రైతులకు రుణాలందించామన్నారు. జగిత్యాల నుండి మామిడికాయలు విదేశాలకు ఎగుమతి చేయబోతున్నట్లు తెలిపారు. నీటి ఎద్దడి దృష్ట్యా రైతులు బిందు సేద్యం ద్వారా పంటలను సాగు చేసుకోవాలన్నారు. కేంద్ర సహకార బ్యాంకు రైతుల అభివృద్ధికోసం ప్రతినిత్యం చేరువలో ఉండే ప్రణాళికలతో ముందుకు పోతుందన్నారు. పంటలను సాగుచేస్తు వందల మందికి ఉపాధి కల్పిస్తున్న రైతు దాసరి భూమయ్యను కొండూరి రవీందర్ రావు అభినందించారు. వీరి వెంట సిఈవో సత్యనారయ రావు, దాసరి భూమయ్య, మాజి సింగిల్ విండోచైర్మన్లు పేరాల గోపాల్ రావు(వెన్నంపల్లి), తుమ్మల శ్రీ రామ్ రెడ్డి ఉన్నారు.
