(24 Mar) కొత్తగూడెం, మార్చి 23: సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని గౌతంఖని ఓపెన్కాస్ట్గనిలో ఎ-రిలే కార్మికులు అధికోత్పత్తిని సాధించార...
(24 Mar) కొత్తగూడెం, మార్చి 23: సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని గౌతంఖని ఓపెన్కాస్ట్గనిలో ఎ-రిలే కార్మికులు అధికోత్పత్తిని సాధించారు. రోప్షావెల్ ద్వారా 30240క్యూబిక్ మీటర్ల ఓబిని తీశారు. మంజీర ద్వారా 17,215 మీటర్ల ఓవర్బడ్డెన్ను తీయడమే కాకుండా షావెల్ ద్వారా 40. 697టన్నుల బొగ్గు ఉత్పత్తిని ఈనెల 15వతేదీ నుండి 21వతేదీ వరకు సాధించారు. వీరికి సోమవారం జరిగిన అభినందన కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్ షేలంరాజు, గని మేనేజర్ ఆర్ నారాయణరావు, ప్రాజెక్టు ఇంజనీర్ ఫ్రెడ్జ్రాల్డ్లు అభినందించి కార్మికులకు బహుమతులను అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ముగిసే ఈనెల చివరినాటికి రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని చేస్తూ గౌతంఖని ఓపెన్‌కాస్ట్‌ను ప్రధమస్థానంలో నిలపాలని కోరారు. ఈకార్యక్రమంలో అడిషనల్ మేనేజర్ కరుణాకర్‌రావు, సేఫ్టి ఆఫీసర్ గోవిందరావు, ఎస్ఇ కృష్ణమోహన్, సంక్షేమ అధికారి బి రాము, గుర్తింపుసంఘమైన టిబిజికెఎస్ నాయకులు ఎ రాములు, మంగ రమేష్ పాల్గొన్నారు.
