హైదరాబాద్: ఆస్తి పన్ను చెల్లించనివారి ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాల ముందు చెత్త డబ్బాలుంచాలని తాను ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదన...

అందువల్ల ఈ అంశంపై దాఖలైన వ్యాజ్యాన్ని మూసివేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఇటీవల ఈ అంశంపై న్యాయవాది బాలాజీ వదేరా హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కౌంటర్ దాఖలు చేశారు.