* మళ్ళీ ఏప్రిల్ 8న రాక * సాగు, తాగు నీటికి అనుకూలమైన మేడిగడ్డ బ్యారేజికే సిఎం మొగ్గు * జెన్కో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రానికి సమృద్...
* మళ్ళీ ఏప్రిల్ 8న రాక
* సాగు, తాగు నీటికి అనుకూలమైన మేడిగడ్డ బ్యారేజికే సిఎం మొగ్గు
* జెన్కో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రానికి సమృద్ధిగా నీరు
* సాగు, తాగు నీటికి అనుకూలమైన మేడిగడ్డ బ్యారేజికే సిఎం మొగ్గు
* జెన్కో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రానికి సమృద్ధిగా నీరు
మహాదేవపూర్, మార్చి 29: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం జిల్లాలోని ర్పాట్లుచేసినప్పటికీ అనివార్య కారణాలవల్ల పర్యటన వాయిదా పడింది. దాంతో ఆదివారం కాళేశ్వరం వద్ద జిల్లా కలెక్టర్ నీతుప్రసాద్, జాయింట్ కలెక్టర్ పౌసమి బసు, మంథని, చొప్పదండి శాసనసభ్యులు పుట్ట మధూకర్, బొడిగ శోభలతోసహా టిఆర్ఎస్ పార్టీ నేతలు సిఎం పర్యటన సందర్భంగా మకాం వేశారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు సిఎం పర్యటన రద్దు అయినట్లు తెలియడంతో అధికారులు, నాయకులు వెనుతిరిగారు. గోదావరి నదీ నీటి పారివాహక ప్రాంతాలను పరిశీలించుటకై ఆదివారం ముఖ్యమంత్రి కెసిఆర్ హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్నారని ముందస్తుగా అన్నిఏర్పాట్లు చేశారు. వాస్తవానికి ఆదివారం సిఎం వరంగల్ జిల్లా నుంచి బయలుదేరి కుంతాన పల్లి, దేవాదుల, కరీంనగర్ జిల్లాలోని ఇచ్చంపల్లి, ముకునూరు, మేడిగడ్డ, కాళేశ్వరం, ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు, తుమ్మిడిహెట్టి ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించాల్సి ఉంది. గోదావరి నదీ నీటి పారివాహక ప్రదేశాల్లో నీటి లభ్యత, నీటి నిల్వలు వాటిని సిఎం ప్రత్యక్షంగా హెలికాప్టర్ ద్వారా పరిశీలించాల్సి ఉంది. దీనంతటికీ కారణం ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించతలపెట్టిన ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును ఎత్తు తగ్గిస్తే ప్రత్యామ్నాయంగా తెలంగాణలో పారుతున్న గోదావరి, ప్రాణహిత, సరస్వతి (అంతర్వాహిని) నదులపై నీటి నిల్వలను బ్యారేజీల నుంచి వాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి ఆదివారం పర్యటించాల్సి ఉండగా దేవాదుల వరకు మాత్రమే వచ్చి అనివార్య కారణాల వల్ల కాళేశ్వరం తదితర ప్రదేశాలను చూడకుండా వెనుతిరిగారు. మండలంలోని మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి సూత్రప్రాయంగా ఇరిగేషన్ శాఖాధికారులు ప్రతిపాదనలు సమర్పించినట్లు సమాచారం. కాగా, మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టడం వల్ల తెలంగాణలోని మేడిగడ్డ, అంబట్పల్లి, సూరారం, బెగుళూరు, బ్రాహ్మణపల్లి, మహాదేవపూర్ కింది భాగం, కుదురుపల్లి, బీరసాగర్, కనె్నపల్లి, కాళేశ్వరం గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే మహారాష్టల్రోని గోదావరి నదీ తీరంలో గల గ్రామాలు పోచంపల్లి, కొత్తపల్లి, వడిదెం, పెంటిపాక, అరుడ, జానంపల్లి, మద్దికుంట, మండలాపురం, చింతలపల్లి, నగరం గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంధ్ర పఢ్నవీస్, గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్రావులతో సిఎం కెసిఆర్ పరస్పర చర్చలు సాగించారు. మరోపక్క కాళేశ్వరం వద్ద 2011లో రూ.220కోట్లతో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను కూడా చేపట్టింది. వీటి ప్రగతిని కూడా చూడవచ్చనే ఉద్దేశంతో ఆదివారం తలపెట్టిన సిఎం ఏరియల్ సర్వే అనుకోకుండా వాయిదా పడడంతో ఇక్కడి ప్రాంత ప్రజలు, నాయకులు, అధికారులు నిరాశలతో వెనుతిరిగారు. మేడిగడ్డ వద్ద నీటి నిల్వ బ్యారేజి నిర్మాణం వల్ల ఇప్పటికే కాళేశ్వరం సమీపంలోని కనె్నపల్లి నుంచి వరంగల్ జిల్లా భూపాలపల్లిలోని జెన్కో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రానికి తరలిస్తున్న నీటికి ఇక కొదువ ఉండదనే సదుద్ధేశ్యంతోనే ముఖ్యమంత్రి భావిస్తున్నారని మంథని ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తెలిపారు. విద్యుత్తు ఉత్పత్తికి కావాల్సిన నీరును సమృద్ధిగా వాడుకోవచ్చని, తద్వారా మున్ముందు విద్యుత్తు కొరత లేకుండా మన వనరులను మనమే ఉపయోగించుకోవచ్చని మధు వివరించారు. రానున్న గోదావరి పుష్కరాలకు ముందు ఏప్రిల్ 8వ తేదీన మళ్ళీ కాళేశ్వరానికి వచ్చేందుకు కెసిఆర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
