RTC Bus to chennur, adilabad -జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి కాలేజ్ రోడ్ : చెన్నూర్‌లో బస్సు డిపోను ఏర్పా టు చేయాలని జడ్పీ వైస్ చైర్మన్ ...
| RTC Bus to chennur, adilabad |
కాలేజ్ రోడ్ : చెన్నూర్‌లో బస్సు డిపోను ఏర్పా టు చేయాలని జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజరెడ్డి రీజినల్ మేనేజర్ వెంకటేశ్వర్లును కోరారు. మంగళవారం ఆర్ఎం మంచిర్యాల డిపోను పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా రాజిరెడ్డి ఆయనను కలిసి డిపో ఏర్పాటుపై చర్చించారు. చెన్నూర్ చు ట్టు పక్కల చాలా గ్రామాలున్నాయని, బస్సు సౌక ర్యం లేక ప్రజలు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణి స్తూ ప్రమాదాలకు గురవుతున్నారని వివరించా రు. చెన్నూర్‌లో డిపో కోసం స్థలాన్ని ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు కూడాఅంగీకరించారని, ఆర్టీసీ అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించి డిపోను ఏర్పాటు చేయాలని ఆర్ఎంను కోరారు. చెన్నూర్ నుంచి ఒకటి, అర్జనగుట్ట నుంచి మరొకటి హైదరాబాద్‌కు మంచిర్యాల డిపో నుంచి బస్సులను నడుపాలని కోరారు.
అందుకు సానుకూలంగా స్పందించిన ఆర్ఎం వెంకటేశ్వర్లు అర్జునగుట్ట నుంచి హైదరాబాద్‌కు వెంటనే బస్సును నడపాలని డీఎం వెంకారెడ్డిని ఆదేశించారు. చెన్నూర్ నుంచి హైదరాబాద్‌కు నడిపేందుకు కొంత సమ యం పడుతుందని ఆర్ఎమ్ తెలిపారు. చెన్నూర్ లో బస్సు డిపో ఏర్పాటు ఆర్టీసీ పరిశీలనలో ఉం దని, అనుకూలమైన స్థలం దొరకగానే ప్రతిపాదనలను ఎండీకీ పంపిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే డిపో ఏర్పాటును ప్రారంభిస్తామని పేర్కొన్నారు.