-పదోతరగతి పరీక్ష కేంద్రాన్ని చూసివస్తూ ఇద్దరు హెచ్ఎంల దుర్మరణం.. మెదక్ జిల్లాలో దారుణం -పరీక్షలకు హాజరయ్యేందుకు కొత్త బట్టలు కొనుక్కుని వ...
-పరీక్షలకు హాజరయ్యేందుకు కొత్త బట్టలు కొనుక్కుని వస్తూ విద్యార్థి మృతి.. నిజామాబాద్ జిల్లాలో ఘోరం
-బస్సును ఢీకొట్టి మరో ముగ్గురు యువకుల మృతి
: రాష్ట్రంలో రహదారులు రక్తమోడాయి. సోమవారం వేర్వేరు ప్రమాదాల్లో మెదక్ జిల్లాలో ఆరుగురు, నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. మృతులో ఇద్దరు ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి ఉన్నత పాఠశాల హెచ్ఎం శ్రీకాంత్‌రెడ్డి (49), శివ్వంపేట మండలం పాంబండ ఉన్నత పాఠశాల హెచ్ఎం చంద్రయ్య(53) కాళ్లాకల్లో పదోతరగతి పరీక్షల పర్యవేక్షణ డ్యూటీ పడింది. గురువారం జరిగే పరీక్షల సామగ్రిని సోమవారం తూప్రాన్ పోలీస్‌స్టేషన్‌లో భద్రపరిచి బైక్‌పై కాళ్లాకల్ సెంటర్‌ను చూడడానికి వెళ్లారు. మనోహరాబాద్ యూటర్న్ వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు వీరి బైక్‌ను ఢీకొట్టడంతో శ్రీకాంత్‌రెడ్డి, చంద్రయ్య మృతిచెందాడు.
శ్రీకాంత్‌రెడ్డిది రామాయంపేట మండలం డి. ధర్మారం, చంద్రయ్యది పాపన్నపేట మండలం కుర్తివాడ. మరో ప్రమాదంలో రామాయంపేట మండలం కొండాపూర్‌కు చెందిన బండలమీది మల్లయ్య(70) పొలానికి వెళ్లి వస్తుండగా బైక్ ఢీకొట్టడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. మరో దుర్ఘటనలో నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం హన్మాజిపేట్కు చెందిన మంగళి నాగరాజు(15) పదోతరగతి చదువుతున్నాడు. పరీక్షల నేపథ్యంలో కొత్త బట్టలు కొనుక్కునేందుకు గ్రామస్తుడు అంజయ్యతో కలిసి బైక్‌పై జిల్లా కేంద్రానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో వర్ని- నిజామాబాద్ రోడ్డుపై ఎదురుగా వస్తున్న మరో బైక్ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. నాగరాజు, మరో బైక్‌పై ఉన్న వర్ని మండలం మల్లారానికి చెందిన షేక్ సలీం(26) అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. రెండు బైక్‌లపై వెనుక కూర్చున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఘటనలో సదాశివపేట మండలం వెంకటాపూర్‌కు చెందిన నరేశ్(26), రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం వెల్చాల్‌కు చెందిన గోపాల్‌రెడ్డి(24), శ్రీహరిగౌడ్(25) బైక్‌పై సదదాశివపేట నుంచి మోమిన్‌పేట వైపు వెళ్తున్నారు. చారిటీగమ్ సిటీ మూలమలుపు వంతెన వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. నరేశ్ కుడిచేయి తెగి పక్కన చెట్టుపై పడింది. నరేశ్‌కు భార్య ప్రస్తుతం గర్భవతి. మిగతా ఇద్దరికి పెండ్లి కాలేదు.