(24 Mar) కరీంనగర్, మార్చి 23: ముందు అనుమతిలేకుండా ప్రభుత్వ భవనాలు, గోడలు, ప్రభుత్వ స్థలాలలో ఎలాంటి పోస్టర్లు, స్టిక్కర్లు అంటించరాదని జి...
(24 Mar) కరీంనగర్, మార్చి 23: ముందు అనుమతిలేకుండా ప్రభుత్వ భవనాలు, గోడలు, ప్రభుత్వ స్థలాలలో ఎలాంటి పోస్టర్లు, స్టిక్కర్లు అంటించరాదని జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొందరు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, కలెక్టరేట్ ఆవరణలో, ప్రభుత్వ భవనాలు, గోడలపై, పబ్లిక్ స్థలాలలో పోస్టర్లు, ప్లెక్సీలు అంటించినట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఆమె తెలిపారు. ఇక ముందు ముందు అనుమతి లేకుండా ప్రభుత్వ భవనాలు, గోడలపై పోస్టర్లు, ప్లెక్సీలు అంటించరాదని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ యాక్టు ప్రకారం పోస్టర్లు, ప్లెక్సీలు తొలగించుటకు తక్షణ చర్యలు తీసుకోవాలని, నగరపాలక, మున్సిపల్, నగర పంచాయతీ కమీషనర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. ముందు అనుమతి లేకుండా ప్రభుత్వ భవనాలు, గోడలపై పోస్టర్లు, ప్లెక్సీలు అంటించిన వారిపై డిపేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్టు ప్రకారం కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ప్రకటనలో ఆదేశించారు.
