బేగంపేట, మార్చి 28: హుస్సేన్‌సాగర్‌లో సరదాగా విహారానికి వెళ్లిన యువతి పడవ బోల్తాపడటంతో మృతిచెందింది. రాంగోపాల్‌పేట పోలీసు స్టేషన్ పరిధిల...
బేగంపేట, మార్చి 28: హుస్సేన్‌సాగర్‌లో సరదాగా విహారానికి వెళ్లిన యువతి పడవ బోల్తాపడటంతో మృతిచెందింది. రాంగోపాల్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనతో విషాదం నెలకొంది. ఇన్స్పెక్టర్ గంగారెడ్డి కథనం ప్రకారం భక్తరాణి (22) అనే యువతిముగ్గురు స్నేహితులతో కలిసి మణికొండలో ఓ హాస్టల్లో వుంటుంది. శనివారం రాత్రి స్నేహితులతో కలసి భక్తరాణి హుస్సేన్‌సాగర్‌లో సరదాకోసం పడవ షికారు ఏర్పాటు చేసుకుంది. నాలుగుసార్లు బుద్ధుని విగ్రహం చుట్టూ తిరిగి ఇక ఒడ్డుకు వద్దామనే సమయంలోనే అతివేగంగా నడుస్తున్న పడవ పడవను ఢీకొట్టడంతో భక్తరాణి సాగర్‌లో పడిపోయి మృతి చెందినట్లు ఆయన తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నట్టు రాం గోపాల్పేట పోలీసులు తెలిపారు.
