తాండూర్: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన సింగరేణి ఉద్యోగి ఉదంతం తాండూర్ మండలం మాదారంటౌన్షిప్లో శుక్రవారం వెలుగు చేసింది. బాధితుని కథనం ...
తాండూర్: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన సింగరేణి ఉద్యోగి ఉదంతం తాండూర్ మండలం మాదారంటౌన్షిప్లో శుక్రవారం వెలుగు చేసింది. బాధితుని కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మాదారంటౌన్షిప్కు చెందిన దిన్ని ప్రభాకర్‌రావు గోలేటి-1ఎ భూగర్భగనిలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. ఈనెల 25న ప్రభాకర్‌రావుకు కొత్త నంబర్ నుండి మనీషాశర్మ అనే యువతి కాల్ చేసి ఎటిఎం కాల్ సెంటర్ నుండి ఫోన్ చేస్తున్నానని మీ ఎటిఎం కార్డు ల్యాప్స్ (గడువు ముగిసిందని) అయిందని, మీ ఎటిఎంలోని ఆరు నంబర్లు డిజిట్లు నంబర్లు ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తే, మీకార్డును ల్యాప్స్ కాకుండా చేస్తామని చెప్పింది. దీంతో ప్రభాకర్‌రావు ఆ యువతి మాటలు నమ్మి ఎటిఎంకు సంబంధించిన వివరాలు తెలిపారు. ప్రభాకర్‌రావు మరుసటి రోజు రెబ్బెన మండలం గోలేటిటౌన్‌షిప్‌లోని ఎస్‌బిహెచ్ బ్యాంక్‌కు వెళ్లి ఎటిఎం ద్వారా కొన్ని డబ్బులు డ్రా చేశాడు. తన ఖాతాలో నిల్వ ఉండాల్సిన డబ్బులలో తక్కువ ఉండటాని ప్రభాకర్‌రావు గమనించి బ్యాంక్ మేనేజర్‌ను సంప్రదించాడు. బ్యాంక్ ఖాతాలో ఉండాల్సిన డబ్బులు వివరాలు తెలిపి అదేవిధంగా యువతి ఫోన్ చేసిన విషయం చెప్పాడు. ప్రభాకర్‌రావు సైబర్ నేరగాళ్ళ చేతిలో మోసపోయడని బ్యాంక్ మేనేజర్ గ్రహించి అతని ఖాతా వివరాలు పరిశీలించారు. ప్రభాకర్‌రావు ఖాతా నుండి సైబర్ నేరగాళ్లు ముంబాయి, నోయిడాలలో రూ.దాదాపు 47వేలు 13సార్లు అన్లైన్ షాపింగ్ ద్వారా డ్రా చేసినట్లు వెలుగు చూసింది. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన విషయం వెలుగు చూడటంతో తన ఖాతాలో ఉన్న మిగితా డబ్బులు డ్రా కాకుండా వెంటనే బ్యాంకు అకౌంట్‌ను బ్లాక్ చేయించాడు. ఏది ఏమైనా సైబర్ నేరగాళ్లు మోసాలు జిల్లాలో తరుచు వెలుగు చూస్తునే ఉన్నాయి.
