ఛత్తీస్‌గఢ్‌లో మావోల స్థావరంపై పోలీసుల దాడి

file photo చింతూరు, మార్చి 25: ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సుకుమా జిల్లాలో మావోయిస్టుల స్థావరంపై పోలీసు బలగాలు బుధవారం దాడి చేశాయి. ఈ ఘటనలో భా...

file photo
చింతూరు, మార్చి 25: ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సుకుమా జిల్లాలో మావోయిస్టుల స్థావరంపై పోలీసు బలగాలు బుధవారం దాడి చేశాయి. ఈ ఘటనలో భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సుకుమా జిల్లా బడేశెట్టి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్పెషల్ టాస్క్ఫోర్స్, డిస్ట్రిక్ ఫోర్స్ సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని ముట్టడించాయి. బలగాల రాకను గమనించిన మావోయిస్టులు వారిపై కాల్పులకు దిగారు. అప్రమత్తమైన పోలీసు బలగాలు సైతం ఎదురు కాల్పులు జరిపారు. సుమారు 2 గంటల పాటు ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం మావోయిస్టులు అడవిలోకి ఉడాయించారు. సంఘటనా స్థలం నుంచి బాంబుల తయారీకి ఉపయోగించే ఇనుప గొట్టాలు, మందుగుండు సామాగ్రి, సోలార్ ఫ్లేట్లు, విప్లవసాహిత్యం, వైర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేలేరుపాడులో భారీ చోరీ వేలేరుపాడు, మార్చి 25: మండల కేంద్రమైన వేలేరుపాడు ప్రధాన రహదారిలో గల ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగిన సంఘటన బుధవారం రాత్రి వెలుగుచూసింది. మామిడి సత్యనారాయణ అనే వ్యాపారి తనకు మూడు దుకాణ సముదాయాలు ఉండగా తాను, తన ఇద్దరు కుమారులు యథాప్రకారం తమ దుకాణాలు తెరిచారు. మహిళలు వారి బంధువులకార్యానికి ఉదయానే్న ఇంటికి తాళాలు వేసి వెళ్లారు. సదరు వ్యాపారి వ్యాపారాన్ని ముగించుకుని గృహంలోకి వెళ్లి చూడగా తలుపులు, బీరువా పగులగొట్టి ఉండటాన్ని చూసి పరిశీలించగా 400 గ్రాముల బంగారం ఇతరత్రా సామాగ్రి రూ.10లక్షలకు పైగానే చోరీ జరిగాయని వాపోయారు. అయితే కుటుంబంలోని మహిళలు ఊరి నుంచి వస్తే ఇంకా ఎంత చోరీ అయ్యిందనేది తెలుస్తుందని చెప్పారు. ఈ విషయం మండలంలో సంచలనంగా మారింది. మండల ప్రజలంతా మామిడి సత్యనారాయణ ఇంటిని సందర్శించి పట్టపగలు ప్రధాన వీధిలో ఇంత భారీ చోరీ జరగడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ విషయంపై స్థానిక ఎస్సై రామచంద్రం సిబ్బందితో వచ్చి పరిశీలించారు. కాగా ఇటీవల వేలేరుపాడులో ప్రధాన వీధుల్లోని పలు దుకాణ సముదాయాల్లో దొంగతనాలు జరిగితే సరైన చర్యలు తీసుకోక పోవడం వల్లనే భారీ చోరీలకు పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదేకాక రుద్రంకోటలో రాత్రి సమయాల్లో ముసుగుల్లో వచ్చి కొందరిని బెదిరించి డబ్బులు దండుకెళ్లారని ఆ విషయంలో సైతం పోలీసులు సరైన రీతిలో దర్యాప్తు చేయకపోవడంతో ఇటువంటి దొంగతనాలు పట్టపగలు బాహాటంగా జరుగుతున్నాయన్న విషయం చోరీ సంఘటన స్థలం వద్దకు వచ్చిన ప్రజలు చెప్పుకున్నారు. నీటి గుంటలోపడి బాలుడి మృతి ముదిగొండ, మార్చి 25: మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం రాజస్థాన్‌కు చెందిన మహేంద్ర సింగ్ దంపతులు కొన్ని సంవత్సరాలుగా వెంకటాపురంలో నివసిస్తున్నారు. వీరికి యువరాజ్‌సింగ్ (02) కుమారుడు ఉన్నాడు. రోజులాగానే యువరాజ్‌సింగ్ ఇంటి ముందు ఆటలాడుకుంటుండగా ప్రమాదవశాత్తు ఇంటిపక్కనే ఉన్న నీటి గుంటలో పడిపోయాడు. గంట తర్వాత కుమారుడి కోసం తల్లిదండ్రులు వెతుకుతుండగా నీటి గుంటలో పడిపోయి ఉండటంతో గుంటలోనుండి తీసి ఆసుపత్రికికి తీసుకెళ్ళగా అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఈ విషయమై ఎటువంటి ఫిర్యాదు రాలేదని ముదిగొండ పొలీసులు తెలిపారు. వైభవంగా నాగదేవత, వేణుగోపాల స్వామి విగ్రహాల ప్రతిష్ఠ మధిర, మార్చి 25: మధిర పట్టణంలోని శ్రీ సీతరామచంద్ర స్వామివారి ఆలయంలో రుక్మిణి, సత్యబామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి, నాగదేవత (జంటనాగుల) విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలను బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని గీతా మందిరంలో శ్రీరుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివార్ల విగ్రహాన్ని రాగి, వేపచెట్టు వద్ద నాగదేవతా విగ్రహాలను వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రతిష్ఠించారు. ఉదయం 8గంటల నుండే ప్రత్యేక హోమ గుండాలను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కోనా జగదీశ్, రంగారావులు పాల్గొన్నారు. ఆలయంలో శ్రీ లలిత విష్ణు సహస్ర పారాయణ కమిటీ వారిచే పారాయణ కార్యక్రమాన్ని, వాసవి నటరాజ సాయి మహిళా కోలాట బృందంచే కోలాట ప్రదర్శనను నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రతిష్ఠా కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీమాన్ శ్రీనివాసుల జనార్థనచారిల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు దేవిశెట్టి శ్రీనివాసరావు, చలువాది ధర్మారావు, చలువాది శ్రీనివాసరావు, కపిలవాయి జగన్, పల్లా రామకృష్ణ, దోకుపర్తి సత్యంబాబు, రాజు, పల్లపోతుల నర్సింహారావు, వంశీ తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్ఠా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులకు సత్యసాయి సేవా సమితి వారు సేవలను అందించారు. క్రికెట్‌లో ఖమ్మం జట్ల గెలుపు ఖమ్మం(స్పోర్ట్స్), మార్చి 25: స్థానిక పెవిలియన్‌గ్రౌండ్‌లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలలో బుధవారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఖమ్మం జట్లు గెలుపొందాయి. ఉదయం జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో ఎస్‌కెఎన్‌సిఎ, ఖమ్మం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఖమ్మం జట్టు 110పరుగులతో విజయం సాధించింది. మాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా శేఖర్ ఎంపికయ్యారు. సాయంత్రం జరిగిన మరో మ్యాచ్‌లో ఖమ్మం ఆర్‌సిసి, ఖమ్మం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఖమ్మం జట్టు విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా వరుణ్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా టౌన్ క్రికెట్ అసోసియోషన్ గౌరవ అధ్యక్షుడు ట్రాపిక్ సిఐ నరేష్‌రెడ్డి మాట్లాడుతూ పోటీలు చాలా ఉత్సాహంగా జరుగుతున్నాయని అన్నారు. ఫైనల్ పోటీలల్లో ఛాంపియన్‌షిప్‌ను దక్కించుకున్న జట్టుకు 50వేల రూపాయల నగదు బహుమతిని అందజేస్తామన్నారు. అదే విధంగా ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్న జట్టుకు 35వేల రూపాయల నగదు బహుమతి ఉంటుందన్నారు. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో కురవెళ్ళ ప్రవీణ్‌కుమార్, పోలాస్ శ్రీనివాస్‌లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన శేఖర్, వరుణ్‌లకు నగదు బహుమతిని ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో టౌర్నమెంట్ ఆర్గనైజర్ మతీన్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. గూడెంలో టెన్త్ పరీక్షలు ప్రారంభం కొత్తగూడెం టౌన్, మార్చి 25: పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం పట్టణంలో పదవతరగతి పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9గంటల సమయానికి విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు తరలివచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన 5595మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సివుండగా 5495మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 100మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 50మంది విద్యార్థులు ప్రైవేట్‌గా పరీక్షలు రాశారు. విద్యార్థుల పరీక్షల కోసం విద్యాశాఖాధికారులు 15సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రాలను పోలీస్‌స్టేషన్ల నుండి సంబంధిత విద్యాశాఖాధికారులు పరీక్ష కేంద్రాలకు తరలించారు. ఏడాది కాలంగా కష్టించి చదివిన విద్యార్థులు పరీక్షలు రాసేందుకు తరలిరావడంతో తమ పిల్లలు పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాస్తుండగా వారి కోసం తల్లిదండ్రులు చెట్లకింద పడిగాపులుకాయడం కనిపించాయి. స్థానిక పోస్ట్ఫాస్‌సెంటర్‌లోని సెయింట్‌మేరీస్, సింగరేణి పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, రామచంద్ర బాలికల, బాలుర పాఠశాల, గౌతమ్‌మోడల్, సూర్యోదయ పాఠశాలలతో పాటు మండలంలోని సుజాతనగర్, రేగళ్ళ ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. మొదటిరోజు పరీక్షలలో అకస్మాతు తనిఖీలు నిర్వహించారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు.

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: ఛత్తీస్‌గఢ్‌లో మావోల స్థావరంపై పోలీసుల దాడి
ఛత్తీస్‌గఢ్‌లో మావోల స్థావరంపై పోలీసుల దాడి
http://4.bp.blogspot.com/-KbjMF21oS8M/VRNcYMowTGI/AAAAAAAAEgE/f_w2nQMyTUw/s1600/AVN24_MAOISTCLASH_14163f.jpg
http://4.bp.blogspot.com/-KbjMF21oS8M/VRNcYMowTGI/AAAAAAAAEgE/f_w2nQMyTUw/s72-c/AVN24_MAOISTCLASH_14163f.jpg
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/03/blog-post_650.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/03/blog-post_650.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy