- మంత్రి కేటీఆర్ సమక్షంలో చేరిక - జిల్లా పరిషత్‌లో టీడీపీకి ఎదురుదెబ్బ రంగారెడ్డి జిల్లా : జిల్లా పరిషత్‌లో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగ...
- మంత్రి కేటీఆర్ సమక్షంలో చేరిక
- జిల్లా పరిషత్‌లో టీడీపీకి ఎదురుదెబ్బ
రంగారెడ్డి జిల్లా : జిల్లా పరిషత్‌లో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కుత్బుల్లాపూర్ జెడ్పీటీసీ, వైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి సైకిల్ దిగి కారెక్కారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి క ల్వకుంట్ల తారకరామారావు, విద్యుత్, రవాణా మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, మహేందరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య సమక్షంలో శనివారం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
సంఖ్యాబలంలేనప్పటికీ తెలుగుదేశం మద్దతుతో జెడ్పీ పీఠాన్ని అధిరోహించిన టీఆర్ఎస్.. తాజాగా టీడీపీకి చెందిన వైస్ చైర్మన్‌ను తమ గూటికి చేర్చుకొని తమ్ముళ్లను ఖంగుతినిపించింది. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఇప్పటికే నలుగురు జెడ్పీటీసీ సభ్యులను తమవైపు తిప్పుకున్న టీఆర్ఎస్.. జిల్లా పరిషత్‌లో సంపూర్ణ ఆధిక్యతను సాధించింది.
విషకౌగిలిని వీడండి: కేటీఆర్
తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్రలు పన్ని ఎంతోమంది చావులకు కారకుడైన ఏపీ సీఎం చంద్రబాబు విషకౌగిలిని ఇకనైనా తమ్ముళ్లు వీడాలని పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రం రాకుండా అడుగడుగునా అడ్డుపడిన బాబు రాష్ట్రం వీడిపోయినా కుయుక్తుల పరంపర కొనసాగిస్తునే ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ పలువురు ప్రజాప్రతినిధులు టీడీపీని వీడుతున్నారని అన్నారు. జిల్లాలో కేసీఆర్ మార్కు పాలన సాగుతుందని, పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం లభిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి రాజకీయ ఏకీకరణ అవసరమని అన్నారు.
ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ, అభివృద్ధితో బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. టీఆర్ఎస్లో చేరిన ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మె ల్యే ఒంటెద్దు పోకడలు తనను బాధించాయన్నారు. అవమానాలు భరిం చరాదనే ఉద్దేశంతోనే టీడీపీని వీడానన్నారు. తెలంగాణ వచ్చినా టీడీపీ నాయకుల తీరుమారలేదని చెప్పారు. ఎమ్మెల్యే లు కాలె యాదయ్య, జీవన్‌రెడ్డి, ఎమ్మె ల్సీ నరేందర్‌రెడ్డి, కుత్బుల్లాపూర్, ఇబ్రహీం పట్నం టీఆర్ఎస్ ఇన్చార్జిలు శంభీపూర్ రాజు, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.