ఆదిలాబాద్ : విద్యార్థి భవిష్యత్తుకు తొలిమెట్టుగా భావించే పదో తరగతి పరీక్షలు జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 11 వరకు...
ఆదిలాబాద్ : విద్యార్థి భవిష్యత్తుకు తొలిమెట్టుగా భావించే పదో తరగతి పరీక్షలు జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 11 వరకు జరగనున్న ఈ పరీక్షలకు జిల్లావిద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లావ్యాప్తంగా 45,946 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 37,116 మంది కాగా ప్రైవేట్‌గా 8830 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు 203 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సంస్కరణల నేపథ్యంలో తొలిసారి సమగ్రమూల్యాంకన విధానంలో జరుగుతున్న పరీక్షలపై అటు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. కొత్త విధానం ప్రకారం పరీక్ష నిర్వహణలో తేడా కనిపించకపోయినా సమాధానాలు రాసే విధానం విషయాలవారీగా వేర్వేరుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాతే ఈ విధానం ఏమేరకు విజయవంతం అయ్యిందో తేలనుంది.చీ/్డ్న్థ్మజి చ్డ్న్థ్మీ ్బై్శ్ఠ=ఖి+2ఖిజిప్రతి కేంద్రానికి ముఖ్య పర్యవేక్షకుడితో పాటు శాఖాధికారిని, 2370 మంది పరిశీలకులు(ఇన్వీజిలేటర్ల)ను నియమించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ద్వితీయభాష పరీక్షకు అరగంట అదనపు సమయాన్ని కేటాయించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరగనుంది. 26 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. ఇక్కడ చూచిరాతలు జరగకుండా ప్రత్యేక సిట్టింగ్‌స్క్వాడ్‌లను నియమించారు. మాల్ ప్రాక్టిస్‌ను కట్టడి చేసేందుకు పది ప్లయింగ్‌స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. వీరు అనుసారించాల్సిన చర్యలపై ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పరీక్షకేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలుచేయనున్నారు. పరీక్ష సమయంలో జిరాక్స్‌కేంద్రాలను పూర్తిగా మూసి ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైనా తెరిచి ఉంచితే వెంటనే వాటిని సీజ్ చేయనున్నారు.చీ/్డ్న్థ్మజి చ్డ్న్థ్మీ ్బై్శ్ఠ=ఖి+2ఖిజిపరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు చూచిరాతలపై ఏమాత్రం ఆశలు పెట్టుకుండా స్వతహాగా రాసేందుకు సిద్ధం కావాలి. చూచిరాతలకు పాల్పడుతూ పట్టుబడితే మరో పరీక్ష రాయనీయమని పాలనాధికారి ఎం.జగన్మోహన్ ఇప్పటికే స్పష్టంచేశారు. చూచిరాతలను ప్రోత్సహించే వారిపైన క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. విద్యార్థులు మాల్‌ప్రాక్టిక్‌కు పాల్పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోకుండా స్వశక్తితో పరీక్షలు రాయాలి.చీ/్డ్న్థ్మజి చ్డ్న్థ్మీ ్బై్శ్ఠ=ఖి+2ఖిజిపది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. అన్ని కేంద్రాల్లో తాగునీరు, పారిశుద్ధ్య వసతులను కల్పించాం. ఏ ఒక్క విద్యార్థి నేలపై కూర్చుని పరీక్ష రాయకుండా ఫర్నిచర్‌ను సమకూర్చాం. పరీక్షకేంద్రాలన్నింటిలో వెలుతురు ఉండేలా విద్యుత్ సౌకర్యం కల్పించేలా చూడాలని సీఎస్, డీఓలను ఆదేశించాం. ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురయ్యే విద్యార్థులకు సత్వర వైద్యమిందించేలా అన్నికేంద్రాల్లో ఆరోగ్యకార్యకర్తలను అందుబాటులో ఉంచుతున్నాం. విద్యార్థులు సకాలంలో పరీక్షకేంద్రాలకు చేరుకునేలా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను కోరాం. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి.చీ/్డ్న్థ్మజి చ్డ్న్థ్మీ ్బై్శ్ఠ=ఖి+2ఖిజివిద్యార్థులు నిర్ణీత సమయంలోగా పరీక్షకేంద్రానికి చేరుకోవాలి.చీ/్డ్న్థ్మజి చ్డ్న్థ్మీ ్బై్శ్ఠ=ఖి+2ఖిజిఅరగంట ముందు నుంచే వారిని లోనికి అనుమతిస్తారు.చీ/్డ్న్థ్మజి చ్డ్న్థ్మీ ్బై్శ్ఠ=ఖి+2ఖిజిఉదయం 10 దాటితే కేంద్రాల్లోకి అనుమతించరు.చీ/్డ్న్థ్మజి చ్డ్న్థ్మీ ్బై్శ్ఠ=ఖి+2ఖిజిహాల్‌టికెట్, పరీక్షప్యాడ్, పెన్నులను మాత్రమే తీసుకురావాలి.చీ/్డ్న్థ్మజి చ్డ్న్థ్మీ ్బై్శ్ఠ=ఖి+2ఖిజిక్యాలిక్యూలేటర్, చేవాణి, ఇతర పుస్తకాలను తీసుకురావొద్దు.చీ/్డ్న్థ్మజి చ్డ్న్థ్మీ ్బై్శ్ఠ=ఖి+2ఖిజిపరీక్ష ముగిసేంతవరకు బయటకు వెళ్లనీయరు
