Beedi Workers హైదరాబాద్ : వినియోగదారుల సూచీలో మార్పులు చోటుచేసుకోవడం కారణంగా పెరిగే డీఏకు అనుగుణంగా బీడీ కార్మికుల కూలీ కూడా రూ.8.30ల ...
![]() |
| Beedi Workers |
హైదరాబాద్ : వినియోగదారుల సూచీలో మార్పులు చోటుచేసుకోవడం కారణంగా పెరిగే డీఏకు అనుగుణంగా బీడీ కార్మికుల కూలీ కూడా రూ.8.30ల చొప్పున పెరుగనున్నాయి. దీంతో బీడీ కార్మికులు, ప్యాకింగ్ కార్మికులు, నెలవారి కార్మికులకు లబ్ది చేకూరనున్నది. 2014 జనవరి నుంచి డిసెంబర్ వరకు సూచీ 83 పాయింట్లు పెరిగింది. గతంలో 1060 పాయింట్లు ఉండగా డిసెంబర్ వరకు 1143 పాయింట్లుగా నమోదైంది. ఈ సూచీ ప్రకారం మే నెల డీఏ పెరుగాల్సిఉంటుంది. బీడీ కార్మికులకు ప్రతీ పాయింట్‌పై 10 పైసల చొప్పున డీఏ పెరుగనుంది. ఈ ప్రకారం ప్రతీ వెయ్యి బీడీలకు రూ.8.30 పైసలు పెరగాల్సి ఉంది. గతంలో వెయ్యి బీడీలకు రూ.145.20 పైసలు ఉండగా తాజాగా పెరిగిన డీఏతో వెయ్యి బీడీలకుగాను రూ.154.77లను యాజమాన్యాలు చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకింగ్ కార్మికులకు రోజుకు రూ.8.30 నెలవారి కార్మికులకు రూ.249 వేతనం పెరగనుంది. పెరిగిన డీఏను ఏప్రిల్ 1 నుంచే అమలు చేయాలని బీఎంఎస్ అనుబంధ బీడీ కార్మికసంఘం నేతలు కలాల్ శ్రీనివాస్, మోటుకూరి సుధీర్‌కుమార్‌లు డిమాండ్ చేశారు.
![]() |
| Beedi Fans |

