(26 Mar) సైదాబాద్, మార్చి 25: కుమారుడిని చూడటానికి అమెరికా వెళ్లి తిరుగు ప్రయాణంలో దుబాయ్ విమానాశ్రయంలో గుండెపోటుతో సైదాబాద్ నివాసి మృతి...
(26 Mar) సైదాబాద్, మార్చి 25: కుమారుడిని చూడటానికి అమెరికా వెళ్లి తిరుగు ప్రయాణంలో దుబాయ్ విమానాశ్రయంలో గుండెపోటుతో సైదాబాద్ నివాసి మృతి చెందాడు. వివరాలు- సైదాబాద్ కాలనీలో వుండే నారాయణరెడ్డి (69) పిడబ్లుడిలో ఇంజనీరుగా పనిచేసి రిటైరయ్యాడు. సైదాబాద్ కాలనీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షునిగా ఆయన సేవలందిస్తున్నారు. మూడు నెలలక్రితం ఆయన అమెరికాలోని కుమారుని వద్దకు వెళ్లి సోమవారం తిరిగి వస్తూ దుబాయ్ విమానాశ్రయంలో వేచి వున్న సమయంలో గుండెపోటు రావడంతో అస్వస్థతకు గురయ్యాడు. అక్కడి సిబ్బంది వైద్య సహాయం అందిస్తుండగా మృతిచెందాడు. ఆయన మృతితో కాలనీలో విషాదఛాయలు నెలకొన్నాయి.
