file photo -40వేల మంది దాకా రాక -స్వామివారి దర్శనానికి బారులు వేములవాడ కల్చరల్: రాజన్న క్షేత్రం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయా ...
| file photo |
-స్వామివారి దర్శనానికి బారులు
వేములవాడ కల్చరల్: రాజన్న క్షేత్రం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయా న్నే ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు, తలనీలాలు సమర్పించి కోడె మొక్కు కోసం గంటల తరబడి నిరీక్షించారు. అనంతరం స్వామివారి దర్శనానికి బారులు తీరారు. కాగా, రూ. 100 పెట్టి శ్రీఘ్రదర్శనం టికెట్ తీసుకున్న వారు సైతం క్యూకట్టారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దాదాపు 40 వేలమంది భక్తులు దర్శించుకున్నారనీ, ఆలయంలో వివిధ ఆర్జిత సేవలద్వారా రూ. 20 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. పట్టణ సీఐ రమేశ్‌బాబు బందోబస్తు ఏర్పాటు చేశారు.
-నేడు రథోత్సవం
శివకల్యాణమహోత్సవం సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం రథోత్సవం నిర్వహిస్తామని ఆలయ ఈఓ దూస రాజేశ్వర్ తెలిపా రు. స్నానాచార్యులు గోపన్నగారి శం కరయ్య ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్ర త్యేక పూ జలు చేసి, మధ్యాహ్నం 3:30గంటలకు రథయాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు.