Yadadri Temple, Yadagirigutta యాదగిరిగుట్ట,: అత్యంత ప్రాధాన్యత కలిగిన గోపురాల నిర్మాణం కోసం ప్లాన్ తయారు చేసేందుకు స్థపతి సౌందర్రాజన...
| Yadadri Temple, Yadagirigutta |
యాదగిరిగుట్ట,: అత్యంత ప్రాధాన్యత కలిగిన గోపురాల నిర్మాణం కోసం ప్లాన్ తయారు చేసేందుకు స్థపతి సౌందర్‌రాజన్ ఆధ్వర్యంలోని 15 మంది బృందం మంగళవారం యాదాద్రి(యాదగిరిగుట్ట)లో పర్యటించింది. ఆగమశాస్ర్తానుసారం నిర్మాణం చేయాల్సిన అత్యంత ప్రాధాన్యత కలిగిన గుడి అంతర్భాగంలోని నిర్మాణాల ప్లాన్ కోసం ఇప్పుడున్న ఎత్తు, వెడల్పు వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రధానార్చకుడు కారంపూడి నర్సింహాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు వివరాలు తెలిపారు. గోపురం ఎత్తు 51 అడుగులకు పెంచాలంటే కింది నుంచి నిర్మాణాలు చేయాల్సిందేనని, అందుకే ఆలయంలో కూడా కొలతలు తీసుకున్నామని సౌందర్‌రాజన్ తెలిపారు.
ఆంజనేయస్వామి ఆలయం, ఆలయ ముఖమండపం, యాగశాల, రామానుజకూటం తదితర నిర్మాణాల కోసం కావాల్సిన కొలతలు తీసుకున్నామని వెల్లడించారు. ఆలయానికి సంబంధించిన ప్లాన్ పూర్తయ్యాక అనుమతుల కోసం సీఎంకు నివేదిస్తామని, త్రిదండి చినజీయర్‌స్వామి ఆమోదంతో పనులు మొదలవుతాయని తెలిపారు. ఉగాది నుంచి పనులు మొదలుపెట్టడానికి అవకాశం ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే ముందస్తుగా ప్రకటించినందున ఈ మేరకు ప్లాన్లు తయారుచేస్తున్నామని పేర్కొన్నారు. టెంపుల్ టౌన్ ప్లానింగ్ దాదాపు పూర్తయిందని వివరించారు.