నల్లగొండ: ఆదివారం సెలవు దినం కావటంతో యాదగిరిగుట్ట భక్తులతో పోటెత్తింది. జంట నగరాల ప్రజలు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ...

నల్లగొండ: ఆదివారం సెలవు దినం కావటంతో యాదగిరిగుట్ట భక్తులతో పోటెత్తింది. జంట నగరాల ప్రజలు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆదివారం ఒక్కరోజే సుమారు 35 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సాధారణ దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. అయితే, క్యూలైన్లలో గంటల కొద్దీ వేచి ఉన్న తమకు అధికారులు కనీసం మంచి నీరు కూడా సరఫరా చేయలేక పోయారని పలువురు భక్తులు అసహనం వ్యక్తం చేశారు.